అజయ్‌ సినిమా స్టంట్ చేశాడు.. బుక్కయ్యాడు.. వైరల్‌గా మారిన పోలీస్‌ వీడియో..!

తనకు ఏ మాత్రం భయం లేదని నిరూపించుకోవడానికో..? లేక ఫేమస్ అవ్వాలన్న ఆశనో తెలీదు గానీ.. ఓ పోలీస్‌ నిజ జీవితంలో అజయ్‌ దేవగన్ సినిమాలోని స్టంట్ చేశాడు.

అజయ్‌ సినిమా స్టంట్ చేశాడు.. బుక్కయ్యాడు.. వైరల్‌గా మారిన పోలీస్‌ వీడియో..!

Edited By:

Updated on: May 12, 2020 | 3:20 PM

తనకు ఏ మాత్రం భయం లేదని నిరూపించుకోవడానికో..? లేక ఫేమస్ అవ్వాలన్న ఆశనో తెలీదు గానీ.. ఓ పోలీస్‌ నిజ జీవితంలో అజయ్‌ దేవగన్ సినిమాలోని స్టంట్ చేశాడు. ఒక్కో కాలు ఒక్కో కారు మీద పెట్టి.. స్టంట్‌ చేస్తూ స్టైల్‌గా ఫోజ్‌ ఇచ్చాడు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. ఆ పోలీస్‌ బుక్కయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ పోలీస్‌పై రూ.5వేల రూపాయల ఫైన్ వేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో ఎస్సైగా పనిచేస్తున్న మనోజ్ కుమార్.. ఇటీవల ఓ స్టంట్ చేశారు. సింగం సినిమాలో అజయ్‌ దేవగన్‌ చేసే స్టంట్‌ను ఈ పోలీస్‌ రియల్ లైఫ్‌లో చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సాగర్ రేంజ్ ఐజీ అనిల్ శర్మ స్పందిస్తూ.. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఇక ఈ విషయాన్ని దర్యాప్తు చేసిన డీఎస్పీ హేమంత్ చౌహాన్‌.. మనోజ్‌కు రూ.5వేలు ఫైన్ వేశారు. దాంతో పాటు విధుల నుంచి తాత్కాలికంగా విరామం కల్పిస్తూ., పోలీస్‌ లైన్లకు అటాచ్‌ చేశారు. ఇలాంటి స్టంట్‌లు మరోసారి చేయకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. వీటి వలన యువతలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని.. ఇలాంటి స్టంట్‌లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా హేమంత్ చౌహాన్ అన్నారు.

Read This Story Also: చైనా వక్రబుద్ధి.. కరోనా వ్యాక్సిన్ డేటా చోరీకి యత్నం..!

Loading...
Unable to load recommendations.
Follow Us