చైనా వక్రబుద్ధి.. కరోనా వ్యాక్సిన్ డేటా చోరీకి యత్నం..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి కరాళనృత్యానికి కారణమైన దేశంగా అమెరికా

చైనా వక్రబుద్ధి.. కరోనా వ్యాక్సిన్ డేటా చోరీకి యత్నం..!
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 2:35 PM

Chinese Hackers: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి కరాళనృత్యానికి కారణమైన దేశంగా అమెరికా నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా… తాజాగా ఈ మహమ్మారిపై జరుగుతున్న వ్యాక్సీన్ పరిశోధనల సమాచారాన్ని కూడా హ్యాక్ చేస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొంటోంది.

కోవిద్-19 వ్యాక్సీన్ పరిశోధనల తాలూకు డేటాను తస్కరించేందుకు చైనా హ్యాకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), సైబర్ సెక్యురిటీ నిపుణులు ఆరోపిస్తున్నారు. కోవిడ్-19కు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు అమెరికాలోని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో… చైనా హ్యాకింగ్‌పై గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైనట్టు అమెరికా మీడియా పేర్కొంది.

కాగా.. అమెరికాలో ఎంత మందికి చికిత్స జరుగుతోంది.. ఎన్ని కరోనా పరీక్షలు జరిగాయి… తదితర మేథోసంపత్తి, సమాచారాన్ని సైతం చైనా హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఈ హ్యాకర్లకు చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ వ్యవహారంపై గట్టి హెచ్చరికలు జారీ చేయనున్నట్టు తెలిపారు. అయితే అమెరికా చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు. అన్ని రకాల సైబర్ దాడులను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?