Rahul Gandhi: రెండు హిందుస్తాన్లను బీజేపీ కోరుకుంటోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్‌..

|

May 16, 2022 | 8:01 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని రెండుగా మార్చుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హిందుస్తాన్ ధనిక, పేద అనే దేశాలుగా మారిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అందరినీ..

Rahul Gandhi: రెండు హిందుస్తాన్లను బీజేపీ కోరుకుంటోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్‌..
Rahul
Follow us on

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విరుచుకుపడ్డారు. దేశాన్ని విభజించాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని రెండుగా మార్చుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హిందుస్తాన్ ధనిక, పేద అనే దేశాలుగా మారిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అందరినీ కలుపుకొంటూ వెళ్తుంటే.. బీజేపీ(BJP) ప్రజలను విభజిస్తోందని మండిపడ్డారు. ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉండే దక్షిణ రాజస్తాన్ లో బంస్వారా ప్రాంతంలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  గుప్పించారు. రెండు భిన్నమైన భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. యూపీఏ ప్రభుత్వం బలంగా తీర్చిదిద్దిన భారత ఆర్థిక వ్యవస్థను మోడీ ధ్వంసం చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.

బీజేపీ ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. నోట్లరద్దు పరిణామాలు, జీఎస్టీని సరిగా అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారేందుకు యూపీఏ ప్రభుత్వం పనిచేసింది. నరేంద్ర మోడీ మాత్రం ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తమకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని దేశంలో యువత భావిస్తోంది. ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతోందని రాహుల్ విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చిందన్న రాహుల్.. అన్నదాతల నిరసనలకు తలొగ్గి వెనక్కి తీసుకుందన్నారు. ఆ చట్టాల వల్ల ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనం కలిగేదని ఆరోపించారు.