ఉపాది హామీ పనులు చేస్తుండగా.. కూలీల ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు! ఏం జరిగిందంటే..

ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే కూలీలపై కాలం పగ బట్టింది. అన్నెం పున్నెం ఎరుగని అల్ప జీవులపై కొబ్బరి చెట్టు కూలింది. అక్కడిక్కడే వారి జీవితాలు తెల్లారిపోయాయి. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని నెయ్యట్టింకరలోని కున్నతుకల్ వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉపాది హామీ పనులు చేస్తుండగా.. కూలీల ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు! ఏం జరిగిందంటే..
Coconut Tree Fell On Daily Wage

Updated on: Sep 20, 2025 | 8:56 PM

తిరువనంతపురం, సెప్టెంబర్‌ 20: ఊరిలో పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే కూలీలపై కాలం పగ బట్టింది. అన్నెం పున్నెం ఎరుగని అల్ప జీవులపై కొబ్బరి చెట్టు కూలింది. అక్కడిక్కడే వారి జీవితాలు తెల్లారిపోయాయి. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని నెయ్యట్టింకరలోని కున్నతుకల్ వద్ద శనివారం (సెప్టెంబర్‌ 20) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

కేరళలోని నెయ్యట్టింకరలోని కున్నతుకల్ వద్ద ఉన్నట్లుడి కొబ్బరి చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఇద్దరు దినసరి కూలీ మహిళా కార్మికులు మరణించారు. బాధితులను వసంత (65), చంద్రిక (64) గా గుర్తించారు. ఇద్దరూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పథకం కింద పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పనివేళల్లో మధ్యాహ్న భోజనం తర్వాత మహిళలు విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఉన్నట్లు ఎలాంటి చడీచప్పుడు లేకుండా చెట్టు హఠాత్తుగా కూలిపోవడంతో చెట్టు కింద నిద్రిస్తున్న ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించినప్పటికీ, ప్రయోజనంలేకపోయింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మహిళా కూలీలు మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడటంతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us