15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు మీకోసం..!

|

Dec 28, 2021 | 6:15 AM

Children Covid Vaccination: దేశంలో జనవరి 3 నుంచి పిల్లలకు (15 నుంచి 18 ఏళ్లలోపు) కరోనా వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.

15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు మీకోసం..!
Children Covid Vaccine
Follow us on

Children Covid Vaccination: దేశంలో జనవరి 3 నుంచి పిల్లలకు (15 నుంచి 18 ఏళ్లలోపు) కరోనా వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం, 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు మాత్రమే కోవాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని కోవిన్ ప్లాట్‌ఫాం చీఫ్ డా.ఆర్.ఎస్.శర్మ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం 10వ తరగతి ఐడీ కార్డు కూడా గుర్తింపు కోసం పరిగణిస్తామని డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. ఎందుకంటే కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు ఉండకపోవచ్చనే దానిపై ఇలాంటి మార్పు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

టీకా నమోదు ప్రక్రియ..
1. ముందుగా కోవిన్ యాప్‌కి వెళ్లాలి. మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఓటీపీని నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వొచ్చు.
2. ఇప్పుడు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, పెన్షన్ పాస్‌బుక్, ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డ్, ఓటర్ ఐడీ, యునిక్ డిసేబిలిటీ ఐడి లేదా రేషన్ కార్డ్ నుంచి ఏదైనా ఒక ఫోటో ఐడీ ప్రూఫ్‌ని ఎంచుకోవాలి.
3. మీరు ఎంచుకున్న ఐడీ నంబర్, పేరు నమోదు చేయండి. అప్పుడు లింగం, పుట్టిన తేదీని ఎంచుకోవాలి.
4. సభ్యుడిని జోడించిన తర్వాత, మీరు మీ సమీప ప్రాంతం పిన్ కోడ్‌ను నమోదు చేయాలి. అప్పుడే టీకా వేసే కేంద్రాల జాబితా వస్తుంది.
5. ఇప్పుడు టీకా తేదీ, సమయం, టీకాను ఎంచుకోవాలి. కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి.
6. టీకా కేంద్రంలో, మీరు రిఫరెన్స్ ఐడీ, రహస్య కోడ్‌ను అందించాలి. అలాగే మీ లాగిన్‌కి ఇతర సభ్యులను జోడించడం ద్వారా మీ టీకాలను నమోదు చేసుకోవచ్చు.
7. కోవాక్సిన్ 12 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించారు. అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
8. డ్రగ్స్ కంట్రోలర్ 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అత్యవసర ఉపయోగం కోసం భారత్ బయోటెక్ కోవాక్సిన్‌ను ఆమోదించినప్పటికీ, ప్రభుత్వం 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్రమే టీకాలు వేయడం ప్రారంభించాలని నిర్ణయించింది.

ప్రభుత్వ డేటా ప్రకారం 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న 100 మిలియన్ మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ చిన్నారులకు తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. చిన్నపిల్లల వ్యాక్సిన్‌కు దేశంలో చాలా కాలంగా డిమాండ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.

30కి పైగా దేశాల్లో..
పిల్లలకు వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా దేశాలు వివిధ పరిస్థితులతో బాధపడుతున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. క్యూబాలో 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌లో 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేస్తున్నారు.

రెండవ, బూస్టర్ డోస్ మోతాదు మధ్య 9 నెలల గ్యాప్ అవసరం..
డాక్టర్. ఆర్.ఎస్. శర్మ మాట్లాడుతూ, 60 ఏళ్ల వయస్సులో రెండు డోస్‌లను తీసుకున్నట్లయితే, రెండవ డోస్ తరువాత బూస్టర్ డోస్‌ వేసుకునేందుకు వ్యత్యాసం 9 నెలలు (39 వారాలు) అవసరం. జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ముందస్తు జాగ్రత్త మోతాదులో కరోనా వ్యాక్సిన్‌ను అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Also Read: Corona Positive: 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు..!

Booster Dose: బూస్టర్ డోస్‌పై కీలక ఆదేశాలు.. నిపుణుల బృందం ఏమన్నారంటే.!