Encounter: కాల్పులమోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. 30మంది మావోయిస్టుల హతం

|

Oct 04, 2024 | 8:04 PM

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం.

Encounter: కాల్పులమోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. 30మంది మావోయిస్టుల హతం
Chhattisgarh Encounter
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు సాయంత్రం వరకు కొనసాగిన్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్‌గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పుల్లో పాల్గొంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో మావోయిస్టులపై సైనికుల యాంటీ నక్సల్ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం(అక్టోబర్ 4) నారాయణపూర్, బీజాపూర్ పోలీసులు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో భారీ విజయం సాధించారు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టలను సైనికులు హతమార్చారు.

ఘటనా స్థలం నుంచి సైనికులు AK-47, SLR వంటి ఆటోమేటిక్ ఆయుధాలను, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సైనికులెవరూ మరణించినట్లు సమాచారం లేదు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో, స్థానిక పోలీసు బలగాలు, డిఆర్‌జి, పారామిలటరీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నక్సలైట్ల స్థావరంపై దాడి చేసి 30 మంది నక్సలైట్లను హతమార్చినట్లు చెబుతున్నారు.

మరణించిన మావోయిస్టుల మృతదేహాలతో శనివారం నారాయణపూర్ ప్రధాన కార్యాలయానికి భద్రతా దళాలు చేరుకుంటారని, అక్కడ గత 8 నెలల్లో 165 మంది నక్సలైట్లు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారని స్థానిక పోలీసులు చెప్పారు. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో నక్సలైట్లు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలను నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కోసం పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 30 మంది మావోయిస్టులు హతమయ్యారని, వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ధృవీకరించారు.

మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం ఉన్న ప్రదేశానికి భద్రతా దళాలు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నప్పుడు, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని దంతెవాడ ఎస్పీ చెప్పారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని పోలీసు అధికారులు తెలిపారు. నారాయణపూర్, దంతేవాడ జిల్లాలకు చెందిన ఉమ్మడి బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని చెప్పారు. ఆ ప్రాంతంలో అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి.

ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆరా తీస్తున్నారు. బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు మావోయిస్టుల తాత్కాలిక శిబిరాన్ని కూల్చివేసి, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..