5G Technology: 5జీ నెట్‌వర్క్‌తో ఎల‌క్ట్రో మాగ్నెటిక్ రేడియేష‌న్ ముప్పు పెరుగుతుందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి..

|

Aug 05, 2022 | 4:59 PM

5G Technology: దేశంలో 5జీ నెట్‌వర్క్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. గతకొన్ని రోజులుగా ఆగస్టు 15 నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభంకానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే...

5G Technology: 5జీ నెట్‌వర్క్‌తో ఎల‌క్ట్రో మాగ్నెటిక్ రేడియేష‌న్ ముప్పు పెరుగుతుందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి..
Follow us on

5G Technology: దేశంలో 5జీ నెట్‌వర్క్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. గతకొన్ని రోజులుగా ఆగస్టు 15 నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభంకానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలపై కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అధికారికంగా ప్రకటన చేశారు. దేశంలో 5జీ సేవలు అక్టోబర్‌ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. అంతేకాకుండా 5జీలోనూ టెలికాం సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని మంత్రి శుక్రవారం మీడియాకు తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌తో ఎలక్ట్రో మాగ్నెటిక్‌ రేడియేషన్‌ పెరుగుతందని జరుగుతోన్న వార్తలను మంత్రి ఖండించారు. మన రేడియేషన్‌ లెవెల్ అమెరికా, యూరప్‌తో పోలిస్తే పది రెట్లు తక్కువని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఇటీవలే 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. స్పెక్ట్రం కేటాయింపుల‌ను ఆమోదించేందుకు త‌మ క‌మిటీ స‌మావేశమైంది. ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధ‌ర‌ల్లో సేవ‌లందించే మార్కెట్ భారత్‌. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 5జీ
5జీ సేవ‌లు వ‌చ్చినా ఇదే ట్రెండ్ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. 5జీ సేవ‌లు ప్రారంభం కాగానే 5జీ ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. భార‌త్‌లో త‌యార‌య్యే 25 నుంచి 30 శాతం మొబైల్ ఫోన్లు 5జీ క‌నెక్టివిటీతో రూపొందించినవే. ప్రతీ ఏటా 5జీ మొబైల్‌ ఫోన్‌ ధరలు తగ్గుతున్నాయి’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..