Lottery: కానిస్టేబుల్ తలరాతను మార్చేసిన 6రూపాయల లాటరీ.. కోటి రూపాయల జాక్ పాట్

కుల్దీప్ సింగ్ కానిస్టేబుల్ కావడంతో లుథియానాకు పని పై వెళ్లినప్పుడల్లా అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఏజెంట్ నుంచి నాగాలాండ్ లాటరీ సంస్థకు చెందిన లాటరీ టికెట్ కొనేవాడు. ఆరు నెలల క్రితం తన తల్లి లాటరీ టికెట్ కొనాలని చెప్పడంతో అప్పటినుంచి

Lottery: కానిస్టేబుల్ తలరాతను మార్చేసిన 6రూపాయల లాటరీ.. కోటి రూపాయల జాక్ పాట్
Lottery Ticket
Follow us

|

Updated on: Aug 06, 2022 | 9:15 AM

Jackpot In lottery: అతడొక సాధారణ కానిస్టేబుల్.. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో క్విక్ రెస్పాన్స్ టీమ్ లో పనిచేస్తున్నాడు. స్వస్థలం రాజస్థాన్ లోని శ్రీగంగానగర్, వృత్తిరీత్యా పంజాబ్ లో ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం తల్లి చెప్పిన మాట వినడంతో అతడికి అదృష్టం కలిసొచ్చింది. ఇంకేముంది గంటల వ్యవధిలో కోటీశ్వరుడై పోయాడు. అదీ ఆరు రూపాయలతో..నమ్మలేకపోతున్నారా..కానీ ఇది నిజం. కుల్దీప్ సింగ్ కానిస్టేబుల్ కావడంతో లుథియానాకు పని పై వెళ్లినప్పుడల్లా అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఏజెంట్ నుంచి నాగాలాండ్ లాటరీ సంస్థకు చెందిన లాటరీ టికెట్ కొనేవాడు. ఆరు నెలల క్రితం తన తల్లి లాటరీ టికెట్ కొనాలని చెప్పడంతో అప్పటినుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం మొదలుపెట్టారు. ఎప్పటికైనా జాక్ పాట్ కొట్టకపోతామా అని ఎప్పుడు లుథియానా వెళ్లినా లాటరీ టికెట్ కొనేవాడు. గతంలో ఒకసారి 6వేల రూపాయలు గెలుచుకున్నాడు. ఎప్పటికైనా ఎక్కువ మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చనే ఆశతో లాటరీ టికెట్లు కొనడాన్ని అలవాటుచేసుకున్నాడు. ధర తక్కువుగా ఉండటంతో గత మంగళవారం లుథియానా వెళ్లినప్పుడు 6 రూపాయల చొప్పున 150 రూపాయలు పెట్టి 25 టికెట్లె కొని..యథావిధిగా విధి నిర్వహణలో తలమునకలయ్యాడు.  అదేరోజు సాయంత్రం సమయంలో అతడికి గాంధీ ట్రేడర్స్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఎత్తగానే, మీరు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారని చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆకానిస్టేబుల్ వంతైంది.

లాటరీలో కోటి రూపాయలు గెల్చుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన కుల్దీప్ సింగ్, తాను గెలుచుకున్న డబ్బును తన ఎనిమిదేళ్ల కుమారుడి చదువుకోసం ఖర్చ చేస్తానని.. పేద విద్యార్థులకు సాయం చేస్తానని చెప్పాడు. మరికొంత మొత్తాన్ని గురుద్వారాలకు విరాళంగా ఇస్తానని తెలిపాడు. తాను కోటి రూపాయలు గెల్చుకున్నా.. సాదాసీదా జీవితాన్ని గడుపుతాని, లైఫ్ స్టైల్ లో ఎటువంటి మార్పురాదని స్పష్టం చేశాడు. ఇక ముందూ లాటరీలు కొంటూనే ఉంటానని, గెలుచుకున్న మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు, నిరుపేద పిల్లల చదువకు వెచ్చిస్తానని చెప్పి శభాష్ అనిపించుకున్నాడు ఈకానిస్టేబుల్.

నాగాలాండ్ కు చెందిన లాటరీ కంపెనీ ఒక్కో టికెట్ ను ఆరు రూపాయిలకు విక్రయిస్తుంది. ప్రతి రోజు మూడు సార్లు మద్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 6గంటలకు, రాత్రి 8గంటలకు ఫలితాలను ప్రకటిస్తుంది. డ్రా తీసేటప్పుడు మూగ్గురుని విజేతలకుగా ప్రకటిస్తుంది. మొదటి బహుమతి కోటి రూపాయలైతే.. రెండో బహుమతి విలువ కేవలం 9వేలు, మూడో బహుమతి విలువ 475 రూపాయలు మాత్రమే. టికెట్ ధర తక్కువ కావడంతో ఎక్కువమంది ఈటికెట్లు కొంటుంటారు. అయితే లాటరీ అనేది లక్కీపై ఆధారపడి ఉంటుంది..అందుకే లాటరీ టికెట్లు కొనేటప్పుడు జర జాగ్రత్త.

ఇవి కూడా చదవండి

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇవ్వబడింది. లాటరీలతో తలరాతలు మార్చుకోవాలని TV9 తెలుగు సిఫార్సు చేయదు)

మరిన్ని జాతీయ వార్తల కోసం

వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం