నాలుగున్నర కోట్ల పన్ను ఎగొట్టావు.. కారు డ్రైవర్‌కి జీఎస్టీ అధికారుల షాక్‌

| Edited By:

Oct 30, 2020 | 3:56 PM

కారు డ్రైవర్‌గా పనిచేసుకునే ఓ వ్యక్తికి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర కోట్ల మేర పన్ను ఎగొట్టావంటూ అతడికి నోటీసులు పంపించారు.

నాలుగున్నర కోట్ల పన్ను ఎగొట్టావు.. కారు డ్రైవర్‌కి జీఎస్టీ అధికారుల షాక్‌
Follow us on

Car Driver Tax Evasion: కారు డ్రైవర్‌గా పనిచేసుకునే ఓ వ్యక్తికి జీఎస్టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర కోట్ల మేర పన్ను ఎగొట్టావంటూ అతడికి నోటీసులు పంపించారు. ఒడిశాలోని రూర్కేలాలో ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ( వైజాగ్‌లో ‘పుష్ప’ షూటింగ్‌.. నెలల గ్యాప్ తరువాత సెట్స్‌పైకి బన్నీ)

వివరాల్లోకి వెళితే.. రూర్కేలాకు చెందిన రాజేంద్ర పల్లై అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా కొద్దిరోజుల క్రితం కటక్‌, జీఎస్టీ ఆఫీసు నుంచి అతడికి కొన్ని నోటీసులు వచ్చాయి. అందులో ”రాజేంద్ర.. ఆర్పీ ఎంటర్ ‌ప్రైజెస్‌ కంపెనీ యజమాని. ఆ కంపెనీ పేరిట 4.31 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయి. అది కూడా నకిలీ కంపెనీ పేరిట, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి పన్ను ఎగ్గొట్టావు అని ఉంది. దాంతో రాజేంద్ర అయోమయానికి గురయ్యారు. ( Dil Bechara: నా నవలకు జీవం పోశారు.. సంజనాకు హాలీవుడ్ రచయిత మెసేజ్‌)

తన ఐడెంటిటీని ఎవరో దొంగిలించారని అతడికి అర్థం ఇచ్చింది. దీనిపై మాట్లాడిన రాజేంద్ర ”కొద్దిరోజల క్రితం ఓ వ్యక్తి నాకు 10 వేల రూపాయలు వచ్చే జీతం ఇప్పిస్తానని చెప్పి, నా నుంచి ఆధార్‌ కార్డు, ఇతర పత్రాలు తీసుకున్నాడు. ఆ పత్రాల ఆధారంగానే నా పేరు మీద నకిలీ కంపెనీ సృష్టించారని తెలిసింది. దీనిపై విచారణ జరపాలని అధికారులను కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చారు. ( యాక్షన్ కింగ్ దర్శకత్వంలో చైతూ..!)