Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి.. కట్‌చేస్తే..

చేపలు పడుతుండగా తన వలకు చిక్కిన అరుదైన గంగానది డాల్ఫిన్‌ను వదిలేయాల్సింది పోయి.. ఓ మత్స్యకారుడు దాన్ని బటకి తెచ్చి సైకిల్‌పై పెట్టుకొని తిప్పుతూ రీల్స్ చేశాడు. దీంతో బాధతో విలవిల్లాడిన ఆ డాల్ఫిక్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ మత్స్యకారుడిపై కేసు నమోదు చేసి దర్యా్తు చేస్తున్నారు పోలీసులు.

Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి.. కట్‌చేస్తే..
Ganges River Dolphin Video

Updated on: Aug 26, 2026 | 6:26 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు మూగజీవులను హింసించే ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ మత్స్యకారుడు సైతం నదిలో దొరికినో అరుదైన గంగానధి డాల్ఫిన్‌ను సైకిల్‌కు కట్టి.. దానికి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా ఊరంతా తిప్పుతూ రీల్స్ చేశాడు. గాయపడి బాధతో విలవిలలాడుతున్న ఆ డాల్ఫిన్‌ను నీటిలో వదలాల్సింది పోయి.. పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు కూడా నవ్వుతూ కనిపించారు. అయితే కాసేపటికే ఆ డాల్ఫిన్ చనిపోయింది.

అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు ఆ మత్స్యకారుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5000వేల గంగానది డాల్పిన్స్ మాత్రమే ఉన్నాయని.. వేగంగా అంతరించి పోతున్న ఇలాంటి అరుదైన జీవులను ఇలా హింసించి చంపడం అస్సలు కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ వీడియోను అటవీశాఖ అధికారులకు ట్యాగ్ చేస్తూ షేర్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సుమారు మూడు రోజుల పాటు సదురు వ్యక్తి కోసం గాలించి చివరకు అతను బీహార్ రాష్టా్నికి చెందిన నేతా లాల్‌గా గుర్తించారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన నేపథ్యంలో అటవీశాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం డాల్ఫిన్‌లను వేటాడటం లేదా చంపడం అనేది చట్టవిరుద్దమని.. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం, రక్షిత జాతులకు సంబంధించిన నేరాలకు, వర్తించే నిబంధనలను బట్టి, జరిమానాతో పాటు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.

గంగా నధి డాల్ఫిన్ ప్రత్యేక ఏంటి?

గంగానది డాల్ఫిన్.. మన దేశంలో వేగంగా అంతరించి పోతున్న అరుదైన జీవుల్లో ఇది ఒకటి. ఇది గంగానది ఆవరణలో అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది. అందుకే దీనిని అడవుల్లో పెద్దపులి పాత్రతో పోల్చుతూ.. గంగానది పెద్దపులి అని పిలుస్తారు. అయితే వీటికి ఉండే మరో ప్రత్యేక లక్షణం ఏమిటంటే.. ఇవి రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పిల్లలకు జన్మనిస్తాయట.. కాబట్టి ఇది కూడా వీటి సంఖ్య తగ్గడానికి ఒక కారణం అని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5000 డాల్ఫిన్స్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి వీటిని అంతరించి పోతున్న జాతిగా గుర్తించి.. అంతర్జాతీయ ప్రకృతి వనరుల సంరక్షణ సంస్థ వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోకి చేర్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us