Mamata Banerjee: మరికొన్ని గంటల్లో తేలనున్న మమత భవితవ్యం.. భవానీపూర్ ఓట్ల లెక్కింపు ప్రారంభం..

|

Oct 03, 2021 | 8:27 AM

Bhabanipur bypoll result 2021: పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన భవానీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు కోల్‌కత్తాలో ప్రారంభమయ్యింది.

Mamata Banerjee: మరికొన్ని గంటల్లో తేలనున్న మమత భవితవ్యం.. భవానీపూర్ ఓట్ల లెక్కింపు ప్రారంభం..
Bhabanipur Bypoll Mamata Vs Priyanka
Follow us on

Bhabanipur bypoll result 2021: పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన భవానీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు కోల్‌కత్తాలో ప్రారంభమయ్యింది. రాజకీయంగా మమతా బెనర్జీకి ఈ ఫలితాలు ఎంతో కీలకం. సీఎం పదవిలో మమతా బెనర్జీ కొనసాగాలా? వద్దా? అని నిర్ణయించే ఎన్నిక ఇది. భవనీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ బరిలో నిలిచారు. సెప్టెంబర్ 30న జరిగిన పోలింగ్‌లో దాదాపు 57.09 శాతం ఓటింగ్ నమోదయ్యింది. మమతా బెనర్జీ భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికకావడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలను సొంతం చేసుకుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ 213 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ కేవలం 77 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచిన మమతా బెనర్జీ… బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ.. ఆరు మాసాల్లో అసెంబ్లీకి ఎన్నికకావాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆమె ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచేందుకు వీలుగా.. పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ మంత్రి సోహన్‌దేవ్ ఛటోపాధ్యాయ మే మాసంలో తన భవానీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

మమతా బెనర్జీపై న్యాయవాది ప్రియాంకను బీజేపీ తన అభ్యర్థిగా భవానీపూర్ నుంచి బరిలో నిలిపింది. సీపీఎం తరఫున శ్రీసిబ్ బిశ్వాస్ పోటీ చేయగా.. కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. భవానీపూర్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌లోని రెండు నియోజకవర్గాలు జాంగిపూర్, సంసెర్‌గంజ్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును కూడా ఇవాళ చేపడుతున్నారు.

Also Read..

Nellore: నెల్లూరులో 30కి పైగా గుడిసెలు తగులపెట్టిన దుండగులు.. బాధితుల ఆక్రందనలు.. అనేక అనుమానాలు.!

Kangana: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి ఆ బాలీవుడ్‌ స్టారో హీరోనే కారణం.. కంగనా సెన్సేషన్ కామెంట్స్‌.