అలెర్ట్: హెల్మెట్ లేకుండా బండి నడిపితే లైసెన్స్ నిషేధం..

|

Oct 20, 2020 | 5:34 PM

బైక్‌పై వెళ్లేవారు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఆదేశించింది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే మూడు నెలల పాటు లైసెన్స్..

అలెర్ట్: హెల్మెట్ లేకుండా బండి నడిపితే లైసెన్స్ నిషేధం..
Follow us on

Riding Without Helmet: రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బైక్‌పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాదు ఈ రూల్‌ను ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానాలు కూడా విధిస్తున్నాయి.

ఈ క్రమంలోనే కర్ణాటక సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బైక్‌పై వెళ్లేవారు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఆదేశించింది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ చేయడంతో పాటు రూ.500 జరిమానా కట్టాలని పేర్కొంది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయన్నారు. ఇప్పటికే బెంగళూరులో హెల్మెట్ లేకుండా బండి నడిపిన వారిపై 20.7 లక్షల కేసులు నమోదయ్యాయని రవాణాశాఖ అధికారి ఒకరు తెలియజేశారు

Also Read:

హెచ్చరిక: మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు.!

వరద బాధితులకు బాసటగా జగన్ సర్కార్.. ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ..