Go First Flight: సాంకేతిక లోపంతో విమానం అత్యవసర ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం..

|

Nov 27, 2021 | 3:57 PM

Flight Emergency Landing: ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా బెంగుళూరు నుంచి పాట్నా వెళ్తున్న గో ఫ‌స్ట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గో ఫస్ట్ విమానం కాక్‌పిట్‌లో

Go First Flight: సాంకేతిక లోపంతో విమానం అత్యవసర ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం..
Flight Emergency Landing
Follow us on

Flight Emergency Landing: ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా బెంగుళూరు నుంచి పాట్నా వెళ్తున్న గో ఫ‌స్ట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గో ఫస్ట్ విమానం కాక్‌పిట్‌లో ఇంజిన్ లోపం కారణంగా నాగ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు విమానాయాన సంస్థ శనివారం తెలపింది. ఈ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణికులు ఉన్నారు. బయలుదేరిన కాసేపటికే ఇంజన్‌లో లోపం తలెత్తడంతో కాక్‌పిట్‌ వార్నింగ్ వ‌చ్చిందని.. దీంతో ఆ విమాన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి ఇంజన్‌ ష‌ట్‌డౌన్ చేసి ల్యాండ్ చేసినట్లు గో ఫ‌స్ట్‌ ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

గో ఫస్ట్ ఫ్లైట్ G8 873 విమానం ఉద‌యం 11.15 నిమిషాలు విమానం సేఫ్‌గా ల్యాండైన‌ట్లు పేర్కొంది. ప్రయాణికులందరినీ.. విమానం నుంచి దింపి వారికి అన్ని వ‌స‌తులు ఏర్పాట్లు చేశామని పేర్కొంది. సాయంత్రం 4.45 నిమిషాల‌కు మ‌రో విమానంలో ప్రయాణికులను పాట్నాకు త‌ర‌లించ‌నున్నట్లు అధికారులు తెలిపారు. విమాన ఇంజన్‌లో లోపాన్ని ఇంజినీర్లు ప‌రిశీలిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

విమానం అత్యవసర ల్యాండింగ్ సమాచారం అందగానే.. నాగ్‌పూర్ విమానాశ్రయంలో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నారు. ముందస్తుగా.. అగ్నిమాపక దళాన్ని, అంబులెన్సులను మోహరించారు.

Also Read:

Tomatoes Stolen: టమాట దొంగలు.. పక్కా ప్లాన్ వేసి ఎత్తుకెళ్లారు.. ఏపీలో కలకలం..

Singer Harini Father: రూ. 150 కోట్ల డీల్!.. సింగర్‌ హరిణి ఫాదర్‌ మృతి వెనుక మిస్టరీ ఇదేనా..?