India Corona: దేశంలో తగ్గుతున్న కొవిడ్ వ్యాప్తి.. కొత్తగా 1500 లోపే కేసులు

|

Mar 27, 2022 | 10:38 AM

దేశంలో కరోనా కేసుల(Corona Cases) సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొన్ని రోజులుగా రెండు వేల లోపే నమోదవుతున్న కేసులు.. కొత్తగా 1500 దిగువకు తగ్గాయి. మరణాలు 150 కి చేరాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల...

India Corona: దేశంలో తగ్గుతున్న కొవిడ్ వ్యాప్తి.. కొత్తగా 1500 లోపే కేసులు
Corona
Follow us on

దేశంలో కరోనా కేసుల(Corona Cases) సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొన్ని రోజులుగా రెండు వేల లోపే నమోదవుతున్న కేసులు.. కొత్తగా 1500 దిగువకు తగ్గాయి. మరణాలు 150 కి చేరాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 6,20,251 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,421 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్(Virus) కారణంగా నిన్న 149 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,21,004కు చేరింది. 1826 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటుండంతో యాక్టీవ్ కేసులు(Active Cases) వేగంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 16,187కు తగ్గి ఆ రేటు 0.04 శాతానికి క్షీణించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. నిన్న 29,90,658 మంది టీకాలు వేయించుకోగా ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 183 కోట్లు దాటింది.

కరోనా కేసుల హెచ్చుతగ్గులపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం రాష్ట్రాలకు అలెర్ట్ చేసింది. కాగా.. ఇప్పటికే వేవ్‌లు, వేరియంట్లతో కరాళనృత్యం చేసింది కరోనా వైరస్. లక్షలాది మందిని బలి తీసుకుంది. కొన్ని వారాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, చైనా సహా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త ( Coronavirus ) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది.

ఇవీ చదవండి.

Natural Star Nani : నయా రూట్ ఎంచుకుంటున్న నేచురల్ స్టార్.. ఖుష్ అవుతున్న నాని ఫ్యాన్స్

Beast Movie: అక్కడ దళపతి విజయ్ మూవీ టైటిల్ మార్చేశారా.? నయా టైటిల్ ఏంటంటే..

Apple CEO Tim: తమిళ విద్యార్థులపై యాపిల్ సీఈవో ప్రశంసల ట్వీట్.. ఎందుకో తెలుసా..!