విజయ్ మాల్యా ఆస్తుల అమ్మకానికి బ్యాంకులకు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్

| Edited By: Anil kumar poka

Jun 03, 2021 | 2:36 PM

ఇండియాలో బ్యాంకులను 9 వేలకోట్ల మేర మోసగించి లండన్ చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకానికి బ్యాంకులకు కోర్టు నుంచి అనుమతి లభించింది. దాదాపు రూ. 5,646 కోట్ల విలువైన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...

విజయ్ మాల్యా ఆస్తుల అమ్మకానికి బ్యాంకులకు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్
Banks Can Now Sell Vijay Mallyas Properties
Follow us on

ఇండియాలో బ్యాంకులను 9 వేలకోట్ల మేర మోసగించి లండన్ చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకానికి బ్యాంకులకు కోర్టు నుంచి అనుమతి లభించింది. దాదాపు రూ. 5,646 కోట్ల విలువైన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం ఇక వీటి విక్రయానికి పూనుకోనుంది. వీటిలో కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులు, సెక్యూరిటీలు ఉన్నాయి. వీటిని ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం గమనార్హం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద వీటిని ఈడీ స్వాధీనం చేసుకోగా..వీటి విక్రయాల ద్వారా తమ రుణాలను రాబట్తుకోవచ్చునని బ్యాంకుల కన్సార్టియం భావిస్తోంది. బెంగుళూరులో యూబీ సిటీ కమర్షియల్ టవర్, కింగ్ ఫిషర్ టవర్ వంటివి దాదాపు 564 కోట్ల ఖరీదు చేస్తాయి. ఇంకా యునైటెడ్ బ్రేవరీస్, యునైటెడ్ స్పిరిట్స్ లో సుమారు 5 వేలకోట్ల విలువ చేసే షేర్లు కూడా మాల్యాకు ఉన్నాయి. అయితే మాల్యా నిర్దోషి అని లండన్ కోర్టు ప్రకటించినా..విచారణ జరగకపోయినా ఆయన ఆస్తులు ఆయనకు తిరిగి అప్పజెబుతామని బ్యాంకుల కన్సార్టియం బాండ్ రాసి ఇవ్వాలని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అకౌంట్లలో తప్పిదాలు ఉన్నాయని ప్రాథమికంగా కోర్టు భావిస్తోంది. ఈ సంస్థపై ఆయనకు పూర్తి కంట్రోల్ ఉందని ఆయన తరఫు లాయర్లు వాదిస్తున్నారు.

తమ క్లయింటు కేవలం పర్సనల్ గ్యారంటీ మాత్రమే ఇచ్చారని, ఇది మనీ లాండరింగ్ చట్ట పరిధిలోకి రాదని ఆ న్యాయవాదులు అంటున్నారు. అటు విజయ్ మాల్యా అప్పగింతపై లండన్ కోర్టులో ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి. తన ఆస్తులు అమ్మి బ్యాంకులు తన రుణాలను రాబట్టుకోవచ్చునని ఆయన కోర్టులో చెబుతున్నారు. అయితే ఇండియాకు ఆయన అప్పగింత విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఆయన లాయర్లు అంటున్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : చూస్తుండగానే కుప్పకూలిన హైవే రోడ్డు..కొత్త రోడ్డు ఇలా జరిగితే ఎలా అని నెటిజన్లు కామెంట్స్ : Viral Video.

 ఆకలికి బ్రెడ్ తింటూ ఊపిరాడక చనిపోయిన చిన్నారి.గొలుసులతో బంధించిన ఆరేళ్ళ చిన్నారి.కన్నీళ్లు పెట్టించే వీడియో : Viral Video

త్రిష, రకుల్‌పై బాలయ్య అభిమానులు ఫైర్‌..ఇండ్రస్ట్రీ లో చక్కర్లు కొట్టిన రెండు న్యూస్ లకు చెక్ : Balakrishna video

కలర్ ఫుల్ లెమర్స్ బలే డాన్స్ చేస్తున్నాయ్.యూరప్ లోని చెస్టర్ జూ లో అరుదైన లెమర్స్ : Viral Video