PM Modi: వార్ధా చేరుకున్న ప్రధాని మోదీకి బంజారా మహిళల అపూర్వ స్వాగతం..

|

Oct 05, 2024 | 6:50 PM

మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. వాషిమ్ చేరుకున్న ఆయనకు సాంప్రదాయ రీతిలో మహిళలు ఘన స్వాగతం పలికారు.

PM Modi: వార్ధా చేరుకున్న ప్రధాని మోదీకి బంజారా మహిళల అపూర్వ స్వాగతం..
Pm Modi In Wardha
Follow us on

మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. వాషిమ్ చేరుకున్న ఆయనకు సాంప్రదాయ రీతిలో మహిళలు ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర పర్యటన సందర్భంగా రూ.56,000 కోట్లకు పైగా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ముందుగా వాషిమ్‌కు వెళ్లిన మోదీ అక్కడ బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించారు. దీని తరువాత, అతను పోహ్రాదేవిలోని జగదాంబ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్‌రావ్ మహారాజ్ సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం థానేలో రూ.32,800 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

అంతకుముందు పోహ్రాదేవిలోని జగదాంబ మాత ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. వాషిమ్‌లోని సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్‌రావ్ మహారాజ్ సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు. పొహ్రాదేవి మహారాష్ట్రలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో ఒకటి. బంజారా కమ్యూనిటీ యొక్క గొప్ప వారసత్వాన్ని తెలిపే ఐదు అంతస్తుల బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నవరాత్రుల పవిత్ర సమయంలో 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేసే అవకాశం ఇప్పుడే లభించిందని అన్నారు. దేశంలోని 9.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.20 వేల కోట్లకు పైగా నగదు బదిలీ అయ్యాయన్నారు. మహారాష్ట్రలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం మహారాష్ట్ర రైతులకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తోంది. నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన కింద మహారాష్ట్రలోని 90 లక్షల మందికి పైగా రైతులకు సుమారు రూ.1900 కోట్లు అందించామన్నారు ప్రధాని మోదీ.

సంచార, పాక్షిక సంచార వర్గాలకు సంక్షేమ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సమాజంలోని సంస్కృతికి సరైన గుర్తింపునిచ్చేందుకు బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఆలోచన మొదటి నుంచీ పరాయిదే. బ్రిటిష్ పాలనలా ఈ కాంగ్రెస్ కుటుంబాలు కూడా దళితులను, వెనుకబడిన తరగతులను, గిరిజనులను తమతో సమానంగా పరిగణించడం లేదని ధ్వజమెత్తారు. భారతదేశాన్ని ఒకే కుటుంబం పాలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఎప్పుడూ బంజారాల పట్ల అవమానకరమైన వైఖరిని కొనసాగించారని మోదీ ఆరోపించారు.

బంజారా హెరిటేజ్ మ్యూజియంపై అందరికీ అభినందనలు తెలియజేశారు ప్రధాని మోదీ. బంజారా సమాజం భారతదేశ సామాజిక జీవితంలో, భారతదేశ నిర్మాణ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిందన్నారు. బంజారా సమాజం భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి అపారమైన శక్తిని అందించి, ఎందరో సాధువులను అందించిందని గుర్తు చేశారు. తరతరాలుగా, వందల వేల సంవత్సరాలుగా, ఈ సంఘం భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, పెంపొందిస్తూ వచ్చిందన్నారు.

ప్రధాని మోదీ ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఆలయంలో మాతా జగదాంబ ఆశీస్సులు పొందే భాగ్యం కలిగిందని అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్‌రావ్ మహారాజ్‌ల సమాధిని కూడా సందర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఇద్దరు మహానుభావులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్ననన్నారు మోదీ.. అంతకుముందు, ప్రధాని మోదీ శనివారం ఉదయం నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ బీజేపీ నాయకుడు అశోక్ చవాన్ ఆయనకు స్వాగతం పలికారు. ఇది మహారాష్ట్రలో ప్రధాని ఒకరోజు పర్యటన.

నాందేడ్ నుంచి హెలికాప్టర్‌లో పోహ్రాదేవికి వెళ్లారు. వాషిమ్ తర్వాత, అతను థానే, ముంబైలను సందర్శించారు. అక్కడ అతను అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి వ్యవసాయం, శుపోషణకు సంబంధించిన చేపట్టిన అనేక 23,300 కోట్ల రూపాయల విలువైన పథకాలను ప్రారంభిస్తాంచారు. రైతులకు సాధికారత కల్పిస్తామని తన వాగ్దానంలో భాగంగా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 18వ విడత రూ. 20,000 కోట్లను సుమారు 9.4 కోట్ల మంది రైతులకు ప్రధాని పంపిణీ చేశారు. ఈ 18వ విడతతో ఇప్పటివరకు రైతులకు మొత్తం రూ.3.45 లక్షల కోట్లు పంపిణీ చేశారు.

రూ.1,920 కోట్ల కంటే ఎక్కువ విలువైన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) కింద 7,500కు పైగా ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. వీటిలో ప్రధానంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ మరియు పంట అనంతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 1,300 కోట్ల టర్నోవర్‌తో 9,200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOS) కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.

స్వదేశీ లింగ క్రమబద్ధీకరించిన వీర్యం సాంకేతికతను కూడా ప్రారంభించారు. రైతులకు సరసమైన ధరలకు లింగ-విభజన చేసిన వీర్యాన్ని అందించడం, దాని ధరను ఒక్కో మోతాదుకు దాదాపు రూ. 200కి తగ్గించడం ఈ చొరవ లక్ష్యం. ఆవుల కోసం “గౌచిప్”, గేదెల కోసం “మహిషాచిప్” జన్యురూప సేవలతో పాటు అభివృద్ధి చేశారు. దీని ద్వారా జెనోమిక్ సెలక్షన్ ద్వారా మంచి నాణ్యమైన ఎద్దులను చిన్నవయసులోనే గుర్తించవచ్చు. ఇది కాకుండా, మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి సౌర్ క్రుషి వాహిని యోజన – 2.0’ కింద 19 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పార్కులను కూడా ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారులను కూడా సత్కరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..