‘కరోనా’ పోతేనే ఆ ‘కాటికాపరి’ అలసట తీరుతుంది

| Edited By:

Sep 12, 2020 | 11:43 AM

పలుచోట్ల కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు కూడా వెనుకంజ వేస్తోన్న విషయం తెలిసిందే

కరోనా పోతేనే ఆ కాటికాపరి అలసట తీరుతుంది
Follow us on

Assam man cremated: పలుచోట్ల కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు కూడా వెనుకంజ వేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది కాటికాపరులు మాత్రం ముందుకొచ్చి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇక రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో వారు కూడా అలసట చెందుతున్నారు. దీంతో కరోనా ఎప్పుడెప్పుడు పోతుందా..? ఎప్పుడెప్పుడు తమ అలసట తీరుతుందా..? అని ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు వారు ఎదురుచూస్తున్నారు.

గౌహతిలోని ఉలుబరికి చెందిన రామనంద సర్కార్‌ ఏప్రిల్ నుంచి మొన్న మంగళవారం వరకు 400 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు అతడి ‘కష్టం’ కాలుతూనే ఉంటాయి. అయితే మొదటిసారి కరోనాతో చనిపోయిన వారి శరీరాన్ని తాకడానికి రామానంద సర్కార్‌ భయపడ్డాడు. అయితే ఇప్పుడు ఆ భయం తనకు లేదంటున్నాడు. చాలాసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, కరోనా తనకు సోకలేదని చెబుతున్నాడు. అయితే అలసట ఆవరించిందని, అయినప్పటికీ. ఈ వృత్తిని మాత్రం వదిలేది లేదంటూ చెప్పుకొచ్చాడు.

Read More:

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌.. వారికి ‘నో’ ఎంట్రీ

దేవరాజ్‌ బ్లాక్‌మెయిల్ చేయడం వలనే మా అక్క చనిపోయింది