జీ20 నేతలకు ఆ కానుక ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది.. ఆనంద్‌ మహీంద్ర ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

|

Sep 14, 2023 | 3:40 PM

భారతదేశంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేకంగా నిలిచే వస్తువులను కేంద్ర ప్రభుత్వం కానుకగా అందించింది. జీ20 సమ్మిట్‌కు హాజరైన విదేశీ నేతలకు అందించిన కానుకల్లో అరకు కాఫీ ఒకటి. ప్రత్యేకంగా ప్యాక్‌ చేసిన కాఫీని దేశాధినేతలకు అందించారు. ఇదే అంశంపై ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ప్రస్తుతం అరకు బోర్డ్‌ చైర్మన్‌గా సేవలందిస్తున్న ఆనంద్‌..

జీ20 నేతలకు ఆ కానుక ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది.. ఆనంద్‌ మహీంద్ర ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..
Anand Mahindra
Follow us on

G20 Summit: భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాలు విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు మొదలు దేశాధినేతలు ఈ సమ్మిట్‌కు తరలిరాగా, భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించింది. ఈ క్రమంలోనే సమావేశాలు ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణమైన విదేశీ నేతలకు భారత ప్రభుత్వం ఎన్నో కానుకలు ఇచ్చి సత్కరించింది.

భారతదేశంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేకంగా నిలిచే వస్తువులను కేంద్ర ప్రభుత్వం కానుకగా అందించింది. జీ20 సమ్మిట్‌కు హాజరైన విదేశీ నేతలకు అందించిన కానుకల్లో అరకు కాఫీ ఒకటి. ప్రత్యేకంగా ప్యాక్‌ చేసిన కాఫీని దేశాధినేతలకు అందించారు. ఇదే అంశంపై ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ప్రస్తుతం అరకు బోర్డ్‌ చైర్మన్‌గా సేవలందిస్తున్న ఆనంద్‌.. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యానికి ప్రధాన ఉదాహరణ అరకు కాఫీ అని ప్రశంసించారు.

ఇదే విషయమై ట్వీట్ చేస్తూ.. ‘అరకు కాఫీ దేశాధినేలకు కానుకగా ఇవ్వడం నన్ను ఎంతో గర్వపడేలా చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, భారత్ లో పెరిగిన రకానికి ఇది కచ్చితమైన ఉదాహరణ. అరకు కాఫీని గిఫ్ట్‌గా ఇవ్వడంపై నేను ఎక్కువ మాట్లాడలేను’ అంటూ ట్వీట్ చేశారు. ఇక జీ20 సమావేశం నుంచి వెనుదిరుగుతున్న విదేశీ నేతలకు కేంద్రం అరకు కాఫీలను గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ ఆనంద్‌ మహీంద్ర ఈ ట్వీట్ చేశారు.

అరకు కాఫీకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలోని అరకు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ తోటల్లో ఈ కాఫీని పండిస్తుంటారు. రుచికి పెట్టింది పేరైన అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా భలే గిరాకీ ఉంది. నంది ఫౌండేషన్‌ ద్వారా అరకు కాఫీ ప్రపంచ స్థాయికి చేరింది, 2008లో ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..