AAP: ఆమె అంటే గౌరవమే.. కానీ ఆయనకే మా మద్దతు.. ఆప్ కీలక ప్రకటన

|

Jul 16, 2022 | 6:07 PM

రాష్ట్రపతి (President) ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో మద్దతు విషయంలో...

AAP: ఆమె అంటే గౌరవమే.. కానీ ఆయనకే మా మద్దతు.. ఆప్ కీలక ప్రకటన
Yashwant Sinha
Follow us on

రాష్ట్రపతి (President) ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో మద్దతు విషయంలో పార్టీలన్నీ ఒక స్పష్టతకు వచ్చేస్తున్నాయి. దేశంలో ఢిల్లీతో పాటు, పంజాబ్ పీఠాలను కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మద్దతు విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పార్టీ రెండు రాష్ట్రాల్లో పది రాజ్యసభ ఎంపీలను కలిగి ఉండటం గమనార్హం. కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ.. తమ మద్దతు విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకే అని ప్రకటించింది. ఈ మేరకు ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే తమకు గౌరవమేనని, కానీ మద్దతు మాత్రం యశ్వంత్‌ సిన్హా (Yashwant Sinha) కే అని అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరుగనుండగా 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్‌ సమయానికే ద్రౌపది ముర్ముకు 50 శాతం ఓటింగ్‌ దక్కింది. కాంగ్రెస్‌, టీఎంసీ, ఎన్సీపీ, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీల మద్దతుతో యశ్వంత్‌ సిన్హా బరిలో ఉన్నారు.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగియనుండడంతో దీన్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి రాష్ట్రపతి ఎన్నికను ప్రకటిస్తున్నారు. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికల తేదీలు ప్రకటించారు. జూలై 24 నాటికి 16వ రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకారం.. నామినేటెడ్ సభ్యులు (లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీలు) ఓటింగ్ భాగంలో భాగం కాదు. ఓటు వేయడానికి కమిషన్ తన తరపున పెన్ను ఇస్తుంది. ఇది బ్యాలెట్ పేపర్‌ను అందజేసే సమయంలో ఇవ్వబడుతుంది. ఈ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. మరేదైనా పెన్నుతో ఓటు వేసినా ఓటు చెల్లదు. దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండేదే ఎలక్టోరల్ కాలేజీ. పార్లమెంటులోని రెండు సభలు లోక్‌సభ, రాజ్యసభల సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది.

ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా ఎమ్మెల్యేలకు మరో విధంగాను ఉంటుంది. 2017 నాటి లెక్కల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు. మొదట ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువగా ఉంటుంది. దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగనణలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి