బాల్యం అంటే ఇలాగే ఉంటుంది.. స్కూల్ కు వెళ్తూ క్యూట్ గర్ల్ ఏం చేసిందంటే..

|

Oct 31, 2022 | 5:33 PM

చిన్న పిల్లలకు నీటిలో ఆడటం అంటే చాలా ఇష్టపడతారు. వద్దని ఎంత చెప్పినా అస్సలు వినరు. నీళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ రచ్చ రచ్చ చేస్తారు. స్కూలుకు వెళ్తూ రోడ్డుపైన నీళ్లు కనిపిస్తే స్కూలు మాట మరిచిపోయి ఆ నీటిలో..

బాల్యం అంటే ఇలాగే ఉంటుంది.. స్కూల్ కు వెళ్తూ క్యూట్ గర్ల్ ఏం చేసిందంటే..
Child Playing
Follow us on

చిన్న పిల్లలకు నీటిలో ఆడటం అంటే చాలా ఇష్టపడతారు. వద్దని ఎంత చెప్పినా అస్సలు వినరు. నీళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ రచ్చ రచ్చ చేస్తారు. స్కూలుకు వెళ్తూ రోడ్డుపైన నీళ్లు కనిపిస్తే స్కూలు మాట మరిచిపోయి ఆ నీటిలో ఆడుతుంటారు కొందరు. తాజాగా ఓ క్యూట్‌ బేబీ స్కూలుకు వెళ్తూ రోడ్డు పక్కన కనిపించిన నీటిలో గంతులేస్తూ ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియలో ఓ చిన్న పాప చక్కగా స్కూల్‌ యూనిఫాం వేసుకొని ఉంది. దానిపైన పింక్‌ హుడీ కూడా ధరించింది. ఇక స్కూలుకి బయలు దేరింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన నీళ్లు కనపడగానే పరుగెత్తుకెళ్లి ఆ నీళ్లలో గంతులేస్తూ ఆటడం మొదలు పెట్టింది.

అలా ఆడుతూ ఆడుతూ పట్టు తప్పి ఆ చిన్నారి నీటిలో పడిపోయింది. అయినా ఏమాత్రం తగ్గకుండా వెంటనే పైకి లేచి నవ్వుతూ కేరింతలు కొడుతూ మళ్లీ ఆట మొదలు పెట్టింది. ఈ క్యూట్‌ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన లక్షలాదిమంది నెటిజన్లు తమను కట్టిపడేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..