హెలికాప్టర్‌లో వచ్చి మరీ దేవాలయంలో పూజలు.. ఆ దేవుడికి అంత మహిమ ఉందా?

| Edited By: Velpula Bharath Rao

Dec 17, 2024 | 12:41 PM

Sarangapur Hanuman Temple: గుజరాత్ రాష్ట్రంలో బొటాద్ ప్రాంతంలో ఉన్న సారంగాపూర్ హనుమాన్ దేవాలయానికి ఓ భక్తుడు హెలికాప్టర్‌లో వచ్చి సందర్శించాడు. హెలికాప్టర్‌ కోసం నిర్దేశించిన ప్రాంతంలో ఆపి, అక్కడే పూజలు చేశాడు.

హెలికాప్టర్‌లో వచ్చి మరీ దేవాలయంలో పూజలు.. ఆ దేవుడికి అంత మహిమ ఉందా?
Sarangapur Hanuman Temple
Follow us on

మనం సాధారణంగా గుడికి వెళ్లాలనుకుంటే ఎలా వెళ్తాం? దగ్గరలో ఉన్న ఆలయానికి అయితే నడుచుకుంటూ వెళతాం.. లేదా కొంచెం దూరం ఉన్నట్లయితే ఏదైనా వాహనం మీద వెళ్లి దర్శనం చేసుకుని వస్తాం. కానీ, ఇక్కడ ఒక భక్తుడు మాత్రం ఏకంగా హెలికాప్టర్‌లో వచ్చాడు. రావడమే కాదు.. ఆ హెలికాప్టర్‌కు పూజలు కూడా చేశాడు. ఇది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

గుజరాత్ రాష్ట్రంలో బొటాద్ ప్రాంతంలో ప్రసిద్ధ సారంగాపూర్ హనుమాన్ దేవాలయం ఉంది. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఆలయానికి పెద్దఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఉన్న ఆంజనేయస్వామి ఎంతో మహిమాన్వితమైన శక్తి కలవాడని భక్తులు నమ్ముతారు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని ఓ భక్తుడు హెలికాప్టర్‌లో వచ్చి సందర్శించాడు. హెలికాప్టర్‌ కోసం నిర్దేశించిన ప్రాంతంలో ఆపి, అక్కడే పూజలు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించిన ఇద్దరు సన్యాసులు కూడా వారితో ఉన్నారు. అందులో ఒక సన్యాసి బొట్టు పెట్టి హెలికాప్టర్‌ మీద పూలు చల్లి భక్తిగా మొక్కుకున్నాడు. కొత్తగా హెలికాప్టర్‌ కొనడంతో అంతా బాగుండాలనే ఉద్దేశ్యంతో సారంగాపూర్ హనుమాన్ మందిరం వద్దకు వచ్చి ఆ భక్తుడు పూజలు చేసినట్లు తెలుస్తోంది. కానీ, భక్తులు పూజ కోసం ఇలా హెలికాప్టర్‌లో రావడం, పైగా వారితో పాటు కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు కూడా ఉండడం అక్కడి చూపరులను ఆకర్షించింది. పూజలు చేసిన అనంతరం వారు మళ్లీ అదే హెలికాప్టర్‌లో తిరిగి వెళ్లిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి