BSF Officer Fraud: ఆ బీఎస్ఎఫ్ అధికారి ఆస్తులను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అక్షరాల రూ.125 కోట్లు.. పోలీసుల సోదాలు

|

Jan 17, 2022 | 11:35 AM

BSF Officer Fraud: ఆ బీఎస్ఎఫ్ అధికారి ఆస్తులను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. హర్యానాలో ఓ బీఎస్ఎఫ్ అధికారి సంపద విలువ రూ.125 కోట్లు. ఆదాయానికి..

BSF Officer Fraud: ఆ బీఎస్ఎఫ్ అధికారి ఆస్తులను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అక్షరాల రూ.125 కోట్లు.. పోలీసుల సోదాలు
Follow us on

BSF Officer Fraud: ఆ బీఎస్ఎఫ్ అధికారి ఆస్తులను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. హర్యానాలో ఓ బీఎస్ఎఫ్ అధికారి సంపద విలువ రూ.125 కోట్లు. ఆదాయానికి మించిన ఆస్తులుతో అలరాలుతున్న బీఎస్ఎఫ్ అధికారి ప్రవీణ్ యాదవ్ ప్రజలను బురిడీ కొట్టిస్తూ అధిక మొత్తంలో సంపాదించుకున్నాడు. హర్యానాలోని గుర్గావ్ కు చెందిన బీఎస్ఎఫ్ అధికారి ప్రవీణ్ యాదవ్ నివాసంలో పోలీసుల సోదాలు నిర్వహించారు. మానేసర్ లో ఎన్ఎస్ జీ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ గా పనిచేస్తున్న ప్రవీణ్.. తాను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ ప్రజలకు రూ.125 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు తేలింది.

అయితే ఇటీవల ప్రవీణ్‌పై పలు అరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీఎస్ అధికారిగా నటిస్తూ ఎన్‌ఎస్‌జీ క్యాంపస్‌లో నిర్మాణ కాంట్రాక్టులు ఇప్పిస్తానని ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. జనవరి 8న ప్రవీణ్ పై ఫిర్యాదు నమోదైంది. తనవద్ద నుంచి రూ.65 కోట్లు తీసుకున్నాడని స్థానిక బిల్డర్ మోనేష్ ఇరానీ ఫిర్యాదుతో ఆయన వ్యవహారం వెలుగు చూసింది. అలగే జనవరి 9న మరో బిల్డర్ దేవిందర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. తన వద్ద నుంచి రూ.37 కోట్లు తీసుకున్నాడని దేవిందర్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రవీణ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు.

అక్రమంగా వసూలు చేసిన డబ్బును ఎన్‌ఎస్‌జీ పేరుతో ఓపెన్ చేసిన నకిలీ ఖాతాకు బదిలీ చేశారు. నకిలీ ఖాతాలను ఓపెన్ చేయడానికి యాక్సిస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న తన సోదరి రీతూ యాదవ్‌ సహాయం తీసుకున్నట్లు తేలింది. దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ నివాసంలో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రవీణ్ తో పాటు, అతని భార్య మమతా యాదవ్, సోదరి రీతూ అమె సహచరుడిని అరెస్టు చేశారు పోలీసులు. స్టాక్ మార్కెట్‌లో రూ. 60 లక్షలు నష్టపోవడంతో మోసాలకు పాల్పడినట్లు ప్రవీణ్ విచారణలో వెల్లడించారు. నష్టపోయిన సొమ్మును సంపాదించే క్రమంలో మోసాలు చేసినట్లు వెల్లడించారు. సోదాలు జరిపిన అధికారులు.. రూ.14 కోట్ల నగదుతో పాటు కోటి రూపాయాల విలువైన ఆభరణాలు, జీప్ , బీఎండబ్ల్యు కారు, వోల్వో కారు, హారియర్ కారు, అలాగే రేంజ్ రోవర్ కారుతో పాటు సఫారీ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!

South Africa: కోవిడ్‌-19తో జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. దక్షిణాఫ్రికా వితండవాదం.. లాక్‌డౌన్‌కు నో..!