Jammu And Kashmir 4G Internet: జమ్మూకశ్మీర్‌లో 18 నెల‌ల త‌ర్వాత 4 జీ ఇంట‌ర్నెట్ సేవల పున‌రుద్ధ‌ర‌ణ‌

|

Feb 06, 2021 | 12:22 PM

Jammu And Kashmir 4G Internet Services: జమ్మూకశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ సేవలు పునరుద్దరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా రద్దు చేసిన సమయంలో ...

Jammu And Kashmir 4G Internet: జమ్మూకశ్మీర్‌లో 18 నెల‌ల త‌ర్వాత 4 జీ ఇంట‌ర్నెట్ సేవల పున‌రుద్ధ‌ర‌ణ‌
Follow us on

Jammu And Kashmir 4G Internet Services: జమ్మూకశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ సేవలు పునరుద్దరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా రద్దు చేసిన సమయంలో భద్రతా కారణాల నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దశలవారీగా ఇంటర్‌నెట్‌ సేవలను పునరుద్దరించారు. 4జీ సేవలను మాత్రం 18 నెలల తర్వాత తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జమ్మూకశ్మీర్‌ పరిపాలన అధికారి రోహిత్‌ కన్సాల్‌ పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5 నుంచి జమ్మూకశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. 4జీ ఇంటర్‌నెట్‌ సేవలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చాయి.

కాగా, గత ఏడాది ఆగస్టులో ప్రయోగాత్మకంగా గండేర్బల్‌, ఉధమ్‌పూర్‌ జిల్లాల్లో 4జీ సేవలను పునరుద్దరించగా, మిగతా 18 జిల్లాల్లో 2జీ సేవలు కొనసాగుతున్నాయి.
అయితే సుప్రీం కోర్టు సూచనతో నియమించిన ప్రత్యేక కమిటీ సలహా ప్రకారం.. పూర్తి శ్రద్దతో భద్రతా పరిస్థితిని సమీక్షించి మొబైల్‌ డేటా సర్వీసులు, అంతర్జాల కనెక్టివిటీలపై కొనసాగుతున్న నిషేధాన్ని తొలగించాలని నిర్ణయించినట్లు హోం శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది.

Also Read: IRCTC Launches: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ