Earthquake: రాజస్థాన్‌‌లోని బికనేర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

|

Feb 12, 2021 | 10:47 AM

Earthquake in Bikaner: రాజస్థాన్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బికనేర్ నగరంలో ఈ రోజు ఉదయం 8.01 గంటలకు..

Earthquake: రాజస్థాన్‌‌లోని బికనేర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Earthquake
Follow us on

Earthquake in Bikaner: రాజస్థాన్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బికనేర్ నగరంలో ఈ రోజు ఉదయం 8.01 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని తెలిపింది. ఈ భూప్రకంపనలతో బికనేర్ నగర ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ప్రజలంతా ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. కాగా.. గతంలోనూ రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపం రాజస్థాన్ బికనేర్ నుంచి వాయువ్య దిశలో 420 కిలోమీటర్ల పరిధిలో ఏర్పడినట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది.

Also Read:

భారతీయులకు హెచ్-1బీ వీసాల జారీపై ఆందోళన.. వర్క్ వీసాలు ఇవ్వొద్దంటున్న ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు

Corona updates: 10 వేలకు దిగువన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే?