Corona Vaccination: దేశంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌.. ఇప్పటి వరకు 1.14 కోట్ల మందికి టీకా

|

Feb 22, 2021 | 8:31 PM

Corona Vaccination: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొంనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో టీకా లబ్దిదారుల సంఖ్ 1.14కోట్లు దాటేసింది. ..

Corona Vaccination: దేశంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌.. ఇప్పటి వరకు 1.14 కోట్ల మందికి టీకా
Follow us on

Corona Vaccination: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొంనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో టీకా లబ్దిదారుల సంఖ్ 1.14కోట్లు దాటేసింది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 1,14,24,094 మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్ని తెలిపారు. ఇందులో 64,25,060 మంది తొలి డోసును, 11,15,542 మంది రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.38,83,492 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు కూడా టీకా తొలి డోస్‌ వేయించుకున్నట్లు తెలిపారు.

కాగా, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, లక్షదీప్‌లో 75 శాతానికి ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోస్‌ టీకా అందినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే నాగాలాండ్‌, పంజాబ్‌, చండీగఢ్‌, పుదుచ్చేరిలో మాత్రం 50 శాతం కన్నా తక్కువగా కోవిడ్‌-19 తొలి డోస్‌ వ్యాక్సినేషన్‌ జరిగినట్లు చెప్పారు.

Also Read: Covid Vaccine:కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఇక భారీగాప్రైవేట్ రంగ భాగస్వామ్యం, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ పాల్