DMart: అదే జోరు.. లాభాల్లో హోరు.. ఆకాశమే హద్దుగా డీమార్ట్‌ దూకుడు..

|

Jan 02, 2022 | 9:59 PM

దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటైన డీమార్ట్‌ 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో డీమార్ట్‌ రూ.9,065 కోట్ల కోట్ల ఆదాయాన్ని గడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే..

DMart: అదే జోరు.. లాభాల్లో హోరు.. ఆకాశమే హద్దుగా డీమార్ట్‌ దూకుడు..
Dmart
Follow us on

దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటైన డీమార్ట్‌ 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో డీమార్ట్‌ రూ.9,065 కోట్ల కోట్ల ఆదాయాన్ని గడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధిక లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ3లో రూ.5,218 కోట్ల డీమార్ట్‌ సొంతం చేసుకుంది. డీమార్ట్‌ క్యూ 3 నికరలాభాల్లో కూడా అదే జోరును ప్రదర్శించింది. 31 డిసెంబర్ 2021 నాటికి కంపెనీ మొత్తం స్టోర్‌ల సంఖ్య 263 ఉంది. ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 17 స్టోర్‌ల పెరిగాయి. శుక్రవారం డీమార్ట్ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 0.55 శాతం పెరిగి రూ.4,665 వద్ద ముగిసింది. 2021 సంవత్సరంలో షేర్లు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.

స్టాక్‌లో భారీ ర్యాలీ అంటే DMart పెట్టుబడిదారు-ప్రమోటర్ రాధాకృష్ణ S దమానీ 2021లో టాప్ 100 ప్రపంచ బిలియనీర్ల బిగ్ క్లబ్‌లో చేరారు.దమానీ ముంబైలోని సింగిల్ రూమ్ అపార్ట్‌మెంట్‌లో పెరిగారు. ఇప్పుడు అతను బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో $24.6 బిలియన్ల నికర విలువతో 63వ స్థానంలో ఉన్నాడు. 

ఈ సూచిక ప్రపంచంలోని అత్యంత సంపన్నుల రోజువారీ ర్యాంకింగ్‌ను చూపుతుంది.

ఇవి కూడా చదవండి: Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..

Viral Video: వామ్మో..! ఇది మైకేల్ జాక్సన్‌ను మించిపోయిందే.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పావురం డ్యాన్స్..