Breaking News
  • ముంపు ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది- మంత్రి కె.తారక రామారావు: ప్రభుత్వం అందిస్తున్న పదివేల తక్షణ అర్ధిక సహాయన్ని పలు కాలనీల్లోని ప్రజలకు అందించిన కెటియార్. పలు కాలనీల్లో పర్యటించి పలు కుటుంబాల యోగక్షేమాలు కనుక్కోని, వారికి అర్ధిక సహాయం అదించిన కెటియార్. వరద భాదితులు ఏంత మంది ఉంటే అంత మందకి సహాయం అందిస్తాం. హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈరోజు నుండి రు.10,000 చొప్పున రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆర్థిక సాయం అందజేస్తుందన్న మంత్రి.
  • చెన్నై: మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి తమిళనటుడు విజయ్‌ సేతుపతి. అయినా సోషల్‌ మీడియా వేదికగా ఆగని బెదిరింపులు. విజయ్‌ కుమార్తెపై దాడి చేస్తామంటూ ట్రోల్‌ చేస్తున్న ఆకతాయిలు . తీవ్రంగా ఖండించిన డీఎంకే ఎంపీ కనిమొళి . స్ట్రీలపట్ల, చిన్న పిల్లలపై సోషల్‌ మీడియాలో.. ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. కారణమైన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి .
  • తాడేపల్లి: పలు కీలక అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష . భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం సమీక్ష . జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ . స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై చర్చ . గ్రామ సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ నిర్మాణంపై సమీక్ష . రేపు ప్రారంభించనున్న వైఎస్సార్‌ బీమాతో పాటు పలు పథకాలపై చర్చ . ఉచిత విద్యుత్‌, రైతు అకౌంట్‌లో నగదు అంశంపై చర్చ .
  • టీవీ9తో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ నారాయణరెడ్డి . హైదరాబాద్‌: తహశీల్దార్‌ నాగరాజుది ఆత్మహత్యలాగానే అనిపిస్తోంది . పిరికివాళ్లు ఎప్పుడూ సూసైడ్‌ చేసుకోరు . ధైర్యవంతులే సూసైడ్‌ చేసుకుంటారు. జైల్లో ఇంటరాగేషన్‌ జరగదు కాబట్టి మానసిక ఒత్తిడితోనే.. నాగరాజు సూసైడ్‌ చేసుకునే అవకాశం ఉంది . జైల్లోకానీ, బయటగానీ ఉ.3-4 గంటల మధ్యే సూసైడ్‌ చేసుకుంటారు . నాగరాజుది పార్షల్‌ హ్యాంగింగ్‌గానే అనే అనిపిస్తోంది . సింథటిక్‌ కాటన్‌ బట్టతో ఉరేసుకుంటే ఎలాంటి మరకలు కన్పించవు . తాడుతో ఉరేసుకుంటే మరకలు కన్పిస్తాయి-నారాయణరెడ్డి . 7 ఫీట్లున్న కిటికీ గ్రిల్‌కి టవల్‌తో ఉరేసుకుంటే ఎలాంటి శబ్ధం రాదు. నాగారాజు సూసైడ్‌ చేసుకునే సమయంలో.. కాళ్లు నేలకు ఆనుకుని ఉండడం వల్లే ఎలాంటి గాయాలు కాలేదు . 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలోనే నాగరాజు చనిపోయి ఉంటాడు . ఆ సమయంలో మిగతా ఖైదీలు గాఢనిద్రలో ఉండడంవల్లే గుర్తించలేదు. - టీవీ9తో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ నారాయణరెడ్డి .
  • విశాఖ: నడువూరు చైన్‌ స్నాచింగ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు . సీసీ కెమెరాల్లో లభించని నిందితుడి ఆచూకీ . పాన్‌షాపులో ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి చైన్‌ను ఎత్తుకెళ్లిన దుండగుడు . టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో నిందితుడిని ట్రాక్‌చేసే పనిలో పోలీసులు . ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితురాలు .

ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కవిత

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఈరోజు గునుగు, తంగేడు, సీతాకుచ్చులతో ఎంగిలి బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల..

Kavitha Bathukamma, ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కవిత

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఈరోజు గునుగు, తంగేడు, సీతాకుచ్చులతో ఎంగిలి బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ పండుగ స్ఫూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందామంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని కవిత సూచించారు. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకూడవద్దని పేర్కొన్నారు. కరోనా ‌కారణంగా ఈ ఏడాది, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదన్నారు.

ఇదిలా ఉంటే కవిత ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ  అయ్యింది. దీంతో ఆమె హోమ్ క్వారంటైన్‌‌లోకి వెళ్లారు.

Related Tags