కొన్ని గంటల్లో పెళ్లనగా ప్లేట్ ఫిరాయించిన యువతి.. ప్రేమించిన వాడితో వెళ్లిపోవడానికి సిద్ధమైన సాప్ట్‌వేర్ ఉద్యోగిని

ఉదయం పెళ్లిపీటలపై కూర్చొని తాళి కట్టించుకున్నయువతి.. అర్ధరాత్రికి ఈ పెళ్లి నాకిష్టం లేదని తనకో బాయ్‌ప్రెండ్ ఉన్నాడని ప్లేట్ పిరాయించింది.

  • Jyothi Gadda
  • Publish Date - 1:13 pm, Sat, 21 November 20

పెళ్లి పీటలపై కూర్చొని తాళి కట్టించుకునేందుకు సిద్ధమైన ఓ యువతి తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ సడెన్‌గా ప్లేట్ ఫిరాయించింది. దీంతో ఒక్కసారిగా పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పెళ్లిమండపం అంతా గందరగోళంగా మారింది.. ఈ లోపు ఊహించని విధంగా పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. వివరాల్లోకి వెళితే..

ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ యువతి చెన్నైలో సాప్ట్‌వేర్ ఉద్యోగినిగా పని చేస్తోంది.. అక్కడే తనతో పాటు పనిచేసే ఓ యువకుడిని ప్రేమించింది. కానీ ఆ విషయం కుటుంబసభ్యుల దగ్గర దాచిపెట్టింది. దీంతో యువతి తల్లి దండ్రులు విషయం తెలియక గుర్రంకొండకు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించి శుక్రవారం ముహూర్తం పెట్టారు. ఇరు కుటుంబాల బంధువులు, పెద్దల సమక్షంలో రిసెష్షన్ కూడా నిర్వహించారు. అప్పటి వరకు ఆ యువతి ఏం చెప్పకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది.. అయితే చెన్నైలో ఆమెను ప్రేమించిన యువకుడు..  తన ప్రియురాలికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని తమిళనాడు పోలీసులకు.. అక్కడి నుంచి కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో అర్ధరాత్రి పెళ్లి మండపంలోకి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసి పెళ్లికూతురుపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆ యువతి  అసలు నిజాన్ని బయటపెట్టింది. తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. దీంతో పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు. పోలీసులు పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులను తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం చెన్నై నుంచి వచ్చిన ఆమె ప్రియుడిని, ఆ యువతిని ఒక్కటి చేసి కడపకు తరలించారు.