పిల్లి ఎదురొస్తే ఆగాలా? మూఢనమ్మకమా.. వెనుక ఉన్న శాస్త్రీయ కారణమా?

సాధారణంగా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండే జంతువులలో పిల్లి ఒకటి. చిన్నపాటి శబ్దం వచ్చినా వెంటనే అలర్ట్‌ అలర్ట్‌ అవుతాయి. తనకు ఏదైనా ప్రమాదం పొంచివుందేమోనని ముందు జాగ్రత్త పడతాయి. అందుకే ఇతర జంతువులను కనిపెడుతుంటాయి. ఈ లక్షణాన్ని పూర్వకాలంలో ప్రజలు జాగ్రత్తగా గమనించేవారని చెబుతారు. పిల్లి సాధారణంగా నడుస్తూ కాకుండా అకస్మాత్తుగా భయంతో ఒక వైపు నుంచి మరో వైపుకు

పిల్లి ఎదురొస్తే ఆగాలా? మూఢనమ్మకమా.. వెనుక ఉన్న శాస్త్రీయ కారణమా?
Cat

Updated on: Sep 05, 2026 | 12:21 PM

చిన్నప్పటి నుండి మన దారికి అడ్డంగా పిల్లి వస్తే పది నిమిషాలు ఆగాలని మన పెద్దల నుండి వింటూనే ఉన్నాం. శకున శాస్త్రంలో కూడా దారికి అడ్డంగా పిల్లి రావడం అనేది చాలా పురాతనమైన, ప్రసిద్ధమైన శకునంగా పరిగణిస్తున్నారు. కానీ ఇది కేవలం మూఢనమ్మకం మీద మాత్రమే ఆధారపడలేదు. ప్రాచీన కాలం నుండి ఉన్న కొన్ని ఆచరణాత్మక కారణాల మీద కూడా ఆధారపడి ఉంది.

శకున శాస్త్రం ప్రకారం నమ్మకాలు:

శకున శాస్త్రం ప్రకారం, ఒక పిల్లి ముఖ్యంగా నల్ల పిల్లి, మీ దారికి అడ్డంగా వెళ్లడం సాధారణంగా అశుభంగా లేదా రాబోయే ఏదో కష్టానికి సంకేతంగా పరిగణిస్తారు.  జ్యోతిష్య శాస్త్రం, శకునాల ప్రకారం, పిల్లిని రాహు గ్రహానికి వాహనంగా లేదా దానితో సంబంధం ఉన్నదిగా పరిగణిస్తారు . రాహువు ప్రమాదాలు, ఆటంకాలు, ప్రతికూల శక్తికి కారణమని భావిస్తారు. అందువల్ల ఒకవేళ పిల్లి మీ దారికి అడ్డంగా వస్తే, రాహువు ప్రతికూల ప్రభావం మీ పనికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు. కొన్ని నమ్మకాల ప్రకారం, ఒక పిల్లి ఎడమ నుండి కుడికి దారిని దాటితే, అది మరింత అశుభంగా భావిస్తారు.

పూర్వకాలంలో ప్రయాణం..

పూర్వకాలంలో ఇప్పటిలా కార్లు, బస్సులు, రైళ్లు ఉండేవి కావు. పెద్ద పెద్ద రహదారులు, అలాగే వీధి దీపాలు కూడా ఉండేవి కావు. ఎక్కువ మంది అడవులు, చెట్లు, పొదల మధ్య ఉన్న మార్గాల్లో కాలి నడకన లేదా ఎడ్లబండ్లపై ప్రయాణించేవారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం. అడవి జంతువులు, విషసర్పాలు లేదా ఇతర ప్రమాదాలు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితి ఉండేది. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. అందుకే ప్రయాణించే సమయంలో చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అయ్యేది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!

సాధారణంగా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండే జంతువులలో పిల్లి ఒకటి. చిన్నపాటి శబ్దం వచ్చినా వెంటనే అలర్ట్‌ అలర్ట్‌ అవుతాయి. తనకు ఏదైనా ప్రమాదం పొంచివుందేమోనని ముందు జాగ్రత్త పడతాయి. అందుకే ఇతర జంతువులను కనిపెడుతుంటాయి. ఈ లక్షణాన్ని పూర్వకాలంలో ప్రజలు జాగ్రత్తగా గమనించేవారని చెబుతారు. పిల్లి సాధారణంగా నడుస్తూ కాకుండా అకస్మాత్తుగా భయంతో ఒక వైపు నుంచి మరో వైపుకు పరుగెత్తితే, సమీపంలో ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఉండవచ్చని భావించేవారు.

అప్పటి కాలంలో పిల్లుల ప్రవర్తనను భట్టి ప్రమాదం ఉండవచ్చని భావించేవారు. అడవులు, నిర్మానుష్య మార్గాల్లో ప్రయాణించే సమయంలో పిల్లి హఠాత్తుగా పరుగెత్తడం వెనుక ఏదో కారణం ఉండవచ్చని పెద్దలు భావించేవారు. అందుకే పిల్లి అడ్డొచ్చిన వెంటనే ప్రయాణాన్ని కొనసాగించకుండా కొద్దిసేపు ఆగేవారు. అవసరమైతే ఎడ్లబండి దిగి చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించేవారు. తర్వాత తమ ప్రయణాన్ని సాగించేవారు. అంటే ఇది భయంతో తీసుకున్న నిర్ణయం కాదు.. ముందు జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయంగా భావించవచ్చు.

రాను రాను పరిస్థితులు మారిపోయాయి. టెక్నాలజీ డెవలప్‌ అయ్యింది. రహదారులు పెరిగిపోయాయి. అడవులు అంతరియపోయాయి. రవాణా సదుపాయం కూడా మెరుగైపోయింది. అయితే పిల్లి అడ్డొస్తే కాసేపు ఆగాలనే ఆచారం మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఇలా ఒకప్పుడు ప్రయాణికుల భద్రత కోసం పాటించిన జాగ్రత్త, కాలక్రమేణా అపశకునం అనే సెంటిమెంట్‌గా మారిపోయిందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే, పిల్లి అడ్డొస్తే అపశకునం అని శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు. పూర్వకాల పరిస్థితుల్లో జంతువుల ప్రవర్తనను గమనించి అప్రమత్తంగా ఉండేందుకు ఏర్పడిన ఒక ఆచారం మాత్రమే. కాలక్రమేణా అది మూఢనమ్మకంగా మారిపోయి ఉండవచ్చని చెబుతుంటారు.

ఇది కూడా చదవండి: Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..

ఇది కూడా చదవండి: Personal Loan: మీకు ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us