
చాలామంది పురుషులు జేబులో వాలెట్, ఫోన్‌తో పాటు ఎప్పుడూ ఒక చిన్న దువ్వెనను తమ దగ్గర ఉంచుకుంటారు. చూడటానికి ఇది కేవలం ఒక సాధారణ వ్యక్తిగత శుభ్రత అలవాటుగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైకాలజీ ఉందని నిపుణులు చెబుతున్నారు. సైకాలజిస్ట్ జాన్ నెజ్లెక్ నివేదికల ప్రకారం ఈ అలవాటు వెనుక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
సైకాలజీ ప్రకారం.. జేబులో ఎప్పుడూ దువ్వెన ఉంచుకునే పురుషులు తమ రూపం, ఇతరుల ముందు తమను ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాము అనే విషయంపై చాలా శ్రద్ధ వహిస్తారు. ప్రసిద్ధ సైకాలజిస్ట్ జాన్ నెజ్లెక్ అధ్యయనం ప్రకారం.. చాలామంది తాము ఎలా కనిపిస్తున్నామనే దానికంటే, ఎదుటివారు తమను ఎలా చూస్తున్నారనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు నీట్‌గా ఉన్నప్పుడు ఇతరులు తమను ఇష్టపడతారనే భావన వారిలో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది.
మన జీవితంలో వాతావరణం, ట్రాఫిక్ లేదా రైలు ఆలస్యం కావడం వంటి అంశాలను మనం నియంత్రించలేం. బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు గాలులకు లేదా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు చెదిరిపోతుంది. అయితే, చెదిరిపోయిన జుట్టును వెంటనే దువ్వెనతో సరిచేసుకోవడం ద్వారా పరిస్థితులు ఇంకా నా నియంత్రణలోనే ఉన్నాయి అనే ఒక రకమైన మానసిక తృప్తి, ప్రశాంతత పురుషులకు కలుగుతుంది.
కొన్నిసార్లు దీని వెనుక పెద్ద మానసిక కారణాలు లేకపోవచ్చు. ఏదైనా ఒక పనిని పదే పదే చేయడం వల్ల అది ఒక అలవాటుగా మారిపోతుంది. ఏదో ఒక సమయంలో జేబులో ఉన్న దువ్వెన అత్యవసరంగా ఉపయోగపడి ఉంటే, ఆ తర్వాతి నుంచి ప్రతిరోజూ జేబులో దువ్వెన పెట్టుకోవడం వారి రోజువారీ రొటీన్‌లో భాగమైపోతుంది.
జేబులో చిన్న దువ్వెనను ఉంచుకోవడం అనేది కేవలం అందంపై దృష్టి పెట్టడం మాత్రమే కాదు, అది ఆ వ్యక్తి క్రమశిక్షణ, తక్షణ సిద్ధత, ప్రశాంతమైన మానసిక స్థితికి సంకేతం. ఒక చిన్న దువ్వెన ఒకరికి కేవలం సాధనం కావచ్చు. కానీ, మరొకరికి అది ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే సాధనంగా పనిచేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..