Summer Drink: సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు ఏ టైమ్ లో తాగాలి..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

|

Apr 10, 2024 | 5:03 PM

సమ్మర్ సీజన్ లో ఇష్టమైన పండ్లు తింటే ఆ మజాయే వేరు. మామిడి పండ్లు, ముంజలను తినడానికి చాలామంది ఇష్టం చూపుతారు. అయితే వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం కూడా. అందుకే బాడీని కూల్ చేసే వాటిని తీసుకోవాలి. అందులో మొదటిది కొబ్బరినీళ్లు. ఒక కొబ్బరి బోండం నీళ్లు తాగితే రోజంతా హుషారుగా ఉండవచ్చు.

Summer Drink: సమ్మర్‌లో కొబ్బరి నీళ్లు ఏ టైమ్ లో తాగాలి..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Coconut Water
Follow us on

సమ్మర్ సీజన్ లో ఇష్టమైన పండ్లు తింటే ఆ మజాయే వేరు. మామిడి పండ్లు, ముంజలను తినడానికి చాలామంది ఇష్టం చూపుతారు. అయితే వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం కూడా. అందుకే బాడీని కూల్ చేసే వాటిని తీసుకోవాలి. అందులో మొదటిది కొబ్బరినీళ్లు. ఒక కొబ్బరి బోండం నీళ్లు తాగితే రోజంతా హుషారుగా ఉండవచ్చు. అదే సమయంలో బాడీని కూల్ చేస్తుంది కూడా. కొబ్బరి నీళ్లలో కాల్షియం, మాంగనీస్ లాంటివి ఉంటాయి. సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే చాలామంది సమయ పాలన లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటాయి. అయితే సమయంలో తాగడం అనేది కూడా తెలుసుకోవాలి.

కొబ్బరినీళ్లు ఏ సమయంలో తాగాలి అనే ప్రశ్న చాలమంది ఉంది. కొంతమంది ఖాళీ కడుపుతో తీసుకుంటే.. మరికొందరు మధ్యాహ్నం తాగడం మంచిదని భావిస్తుంటారు. ఈ విషయమై జైపూర్‌కు చెందిన డైటీషియన్ మాట్లాడుతూ భోజనంతో లేదా తర్వాత అసలు తాగకూడు. గుండెల్లో మంట సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీటిని తాగాలి. అయితే, ఖాళీ కడుపుతో ఈ హెల్తీ డ్రింక్ తాగడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. అంతేకాదు… బరువును తగ్గిస్తుంది కూడా.

కడుపు ఆరోగ్యంగా ఉంటే శరీరం అనేక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యల నుండి రక్షించబడుతుంది. అయితే సమస్యలతో భాధపడేవారు నిపుణుల సలహా మేరకు మధ్యాహ్నం కూడా తాగవచ్చు.  సమ్మర్ సీజన్ కాబట్టి కొబ్బరి నీరు తీసుకోవడం ముఖ్యం. కానీ కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరినీళ్లు తాగకూడదు. ఇది అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది కాబట్టి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అలాంటివారు డాక్టర్ల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.