Best Road Trips: వారాంతపు సెలవులను ఎంజాయ్ చేయడానికి బెంగళూరు సమీపంలోని బెస్ట్ ప్లేసెస్ ఇవే

| Edited By: Surya Kala

Jul 10, 2021 | 9:48 PM

 Best Road Trips: భారతదేశంలోని ఉత్తమ నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ నగర సమీపంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వారాంతపు సెలవుల్లో...

Best Road Trips: వారాంతపు సెలవులను ఎంజాయ్ చేయడానికి బెంగళూరు సమీపంలోని బెస్ట్ ప్లేసెస్ ఇవే
Bangalore
Follow us on

Best Road Trips: భారతదేశంలోని ఉత్తమ నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ నగర సమీపంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వారాంతపు సెలవుల్లో ఆహ్లాదకరంగా ఈ ప్రదేశాల్లో గడపవచ్చు. పశ్చిమ కనుమలను అనుకుని ఉన్న కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల గురించి ఈరోజు ట్రావెల్ గైడ్ లో తెలుసుకుందాం.

*కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న అందమైన ప్రదేశం చిక్ మంగుళూరు. ఇది ఒక హిల్ స్టేషన్. బెంగళూరు నుంచి చిక్ మంగుళూరు చేరుకోవడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ హిల్ స్టేషన్ ప్రకృతి అందాలతో అలరారుతుంది. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన కాఫీ ఎస్టేట్లు ఉన్నాయి. కాఫీ ప్రేమికులకు మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. ముల్లయంగిరి అని పిలువబడే ఎత్తైన శిఖరం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని ట్రెక్కింగ్ అనుభవం కోసం విజిట్ చేయవచ్చు

*కూర్గ్ ఇది ఒక పురాణ పర్యాటక ప్రాంతం. బెంగళూరు నుండి కేవలం 5 గంటల ప్రయాణం చేస్తే కూర్గ్ కు చేరుకోవచ్చ. ఈ కూర్గ్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు నిలయం. ప్రకృతి ప్రేమికులకు ఇది వారాంతపు సెలవుదినంలో మంచి పర్యాటక ప్రాంతం. పర్వతారోహకులు, పక్షుల పరిశీలకుల ఇది స్వర్గధామం. ఇది కూడా కాఫీ ఎస్టేట్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ రాత్రి బస చేయడానికి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి.

*కర్ణాటకలోని బెంగళూరు నుంచి మొదలు పెట్టిన పర్యటన నీలగిరి కొండలను సందర్శించడానికి తమిళనాడులో అడుగు పెట్టండి. ఇది కూడా మంచి అందమైన హిల్ స్టేషన్. ఎల్లప్పుడూ పర్యాటకులతో నిండి ఉంటుంది. ఇక్కడ తేయాకు తోటలకు ప్రసిద్ధి. దక్షిణ భారతదేశంలో ట్రెక్కింగ్ చేయగల ప్రదేశాలలో నీలగిరి అతి ముఖ్యమైనది. బ్రిటిష్ కాలం నాటి మనోహరమైన బంగ్లాలతో నిండి ఉన్న నీలగిరి పర్యటన ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుస్తుంది.

Also Read: ఈ ఆలయంపై ఎక్కువమంది ముస్లింరాజుల దండయాత్ర.. ఒక్క ఘజనీనే 6 టన్నుల కంటే ఎక్కువ బంగారం దోచుకెళ్లిన వైనం