IRCTC: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా కేరళ టూర్‌.. తక్కువ ధరలోనే ఫ్లైట్‌ జర్నీ..

|

Apr 07, 2024 | 4:09 PM

ఎండలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి రమణీయతకు పెట్టిందిపేరైన కేరళ టూర్ వెళ్తే భలే ఉంటుంది కదూ! అయితే మీలాంటి వారి కోసమే ఐర్‌సీటీసీ ఓ స్పెషల్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఆపరేట్‌ అవుతోన్న ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు...

IRCTC: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా కేరళ టూర్‌.. తక్కువ ధరలోనే ఫ్లైట్‌ జర్నీ..
IRCTC
Follow us on

ఎండలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి రమణీయతకు పెట్టిందిపేరైన కేరళ టూర్ వెళ్తే భలే ఉంటుంది కదూ! అయితే మీలాంటి వారి కోసమే ఐర్‌సీటీసీ ఓ స్పెషల్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఆపరేట్‌ అవుతోన్న ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌ జర్నీతో కూడిన ఈ టూర్‌ 6 రాత్రులు/7 రోజులు ఉంటుంది. ఇందులో భాగంగా కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం ప్రాంతాలు కవర్‌ అవుతాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 24వ తేదీన ఈ టూర్‌ అందుబాటలో ఉంటుంది. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవతాయి.? టూర్‌ ఎన్ని రోజులు ఉంటుంది.? మీకోసం..

* మొదటి రోజు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఫ్లైట్‌ ఉంటుంది. కొచ్చిలో దిగగానే ఎయిర్‌ పోర్ట్ నుంచి హోటల్‌కి తీసుకెళ్తారు. అనంతరం భోజనం పూర్తి చేసుకొని యూదుల ప్రార్థనా మందిరం, డచ్ ప్యాలెస్, చైనీస్ ఫిషింగ్ నెట్‌లను సందర్శిస్తారు. తర్వాత సాయంత్రం మెరైన్ డ్రైవ్‌ ఉంటుంది. రాత్రి బస కొచ్చిన్‌లోనే ఉంటుంది.

* రెండో రోజు ఉదయం హోటల్‌లో టిఫిన్‌ చేశాక. 130 కి.మీ దూరంలో ఉన్న మున్నార్‌కు బయలుదేరి వెళ్తారు. మధ్యలో చీయపారా జలపాతం చూడొచ్చు. అనంతంర మున్నార్‌లో హోటల్‌లోకి చెక్‌ ఇన్‌ అయిన తర్వాత టీ మ్యూజియం చూడాలి. రాత్రి బస మున్నార్‌లోనే ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్‌ ఫాస్ట్ చేసిన తర్వాత మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండ్లా డ్యామ్ సరస్సు కవర్ చేసేలా మున్నార్‌లో టూర్ ఉంటుంది. రాత్రి మున్నార్‌లోనే బస ఉంటుంది.

* 4వ రోజు హోటల్‌లో టిఫిన్‌ చేశాక.. తేక్కడికి వెళ్తారు. అక్కడ స్పైస్ ప్లాంటేషన్లను సందర్శన ఉంటుంది. రాత్రి డిన్నర్, బస తేక్కడిలో ఉంటుంది.

* 5వ రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత.. అలెప్పి/కుమారకోమ్ కు బయలుదేరి వెళ్లాలి. ఇక్కడ బ్యాక్ వాటర్స్ రైడ్ ఉంటుంది. రాత్రి బస అక్కడే.

* 6వ రోజు ఉదయం టిఫిన్‌ అయ్యాక.. చడియమంగళం బయలుదేరతారు. అక్కడ జటాయు ఎర్త్ సెంటర్‌ని చూస్తారు. అనంరతం అక్కడి నుంచి త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ అయ్యాక డిన్నర్, రాత్రిపూట త్రివేండ్రంలో బస చేస్తారు

* 7వ రోజు ఉదయం పద్మనాభ స్వామి ఆలయం సందర్శన ఉంటుంది. నేపియర్ మ్యూజియం, అజిమల శివుని విగ్రహాన్ని సందర్శించవచ్చు. ఇక సాయత్రం త్రివేండ్రం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది.

ధర ఎలా ఉంటుందంటే..

కంఫర్ట్‌ క్లాస్‌ సింగిల్‌ ఆక్యూపెన్సీ ఒక్కో వ్యక్తికి రూ. 53,100గా ఉంటుంది. డబుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ. 35,700, ట్రిపుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 33,750, చైల్డ్ విత్ బెడ్ 5-11 ఏళ్లు రూ 29900, చైల్డ్ విత్ అవుట్ బెడ్ 5-11 ఇయర్స్ రూ 23,300, చైల్డ్ విత్ అవుట్ బెట్,2-4 ఏళ్లు రూ 15,400గా నిర్ణయించారు.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..