అక్టోబర్‌లో ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? ఈ 7 టూరిస్ట్‌ ప్లేసులు అస్సలు మిస్‌ కావొద్దు!

India's Best Places to Visit in October: అక్టోబర్‌లో దేశంలోని పలు ప్రాంతాలు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రకృతి, పండుగల సందడితో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కశ్మీర్‌ నుంచి కేరళ వరకు, గోవా నుంచి రాజస్థాన్‌ వరకు ఈ నెలలో తప్పక సందర్శించాల్సిన 7 అద్భుతమైన ప్రదేశాలు ఇవే.

అక్టోబర్‌లో ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? ఈ 7 టూరిస్ట్‌ ప్లేసులు అస్సలు మిస్‌ కావొద్దు!
India's Best Places To Visit In October

Updated on: Sep 26, 2026 | 8:21 PM

October Lo Chudalsina Pradeshalu: అక్టోబర్‌ అంటే పండుగల సందడి, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రకృతి కలిసే ప్రత్యేక సమయం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాకాలం తగ్గుముఖం పట్టడంతో వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా మారుతుంది. శీతాకాలపు రద్దీ ఇంకా మొదలు కాకపోవడంతో ప్రయాణాలకు ఇది అనువైన నెలగా భావించవచ్చు. ప్రకృతి, సంస్కృతి, చరిత్ర, బీచ్‌లు, వన్యప్రాణులు.. ఇలా ప్రతి రకమైన ప్రయాణికుడికి అక్టోబర్‌ ఎన్నో అవకాశాలను అందిస్తుంది.

కోల్‌కతాలో దుర్గాపూజ సందడి

అక్టోబర్‌లో కోల్‌కతా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దుర్గాపూజ సందర్భంగా నగరం మొత్తం రంగురంగుల పండళ్లతో కళకళలాడుతుంది. విభిన్న థీమ్‌లతో ఏర్పాటు చేసే పండళ్లు, విద్యుత్‌ దీపాలంకరణలు, వీధి ఆహారం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. రాత్రివేళ నగరాన్ని సందర్శించడం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.

రాజస్థాన్‌ కోటలు, సరస్సులు

వేసవి వేడి తగ్గడంతో అక్టోబర్‌లో రాజస్థాన్‌ సందర్శన మరింత సౌకర్యంగా ఉంటుంది. ఉదయ్‌పూర్‌లోని పిచోలా సరస్సు, సిటీ ప్యాలెస్‌, అరవళ్లి కొండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జోధ్‌పూర్‌లోని మెహ్రాన్‌గఢ్‌ కోట కూడా సందర్శించవచ్చు. ఎడారి ప్రాంతాలను చూడాలనుకునేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శరదృతువులో కశ్మీర్‌

అక్టోబర్‌లో కశ్మీర్‌ మరో అందమైన రూపాన్ని సంతరించుకుంటుంది. చినార్‌ చెట్ల ఆకులు బంగారు, గోధుమ రంగుల్లోకి మారడం అద్భుత దృశ్యాన్ని అందిస్తుంది. దాల్‌ లేక్‌లో షికారా ప్రయాణం, చుట్టుపక్కల లోయల సందర్శన ప్రకృతి ప్రేమికులకు మంచి అనుభూతిని ఇస్తాయి.

పచ్చదనంతో కేరళ

వర్షాకాలం తర్వాత కేరళ మరింత పచ్చగా కనిపిస్తుంది. అలప్పుజలో బ్యాక్‌వాటర్స్‌, మున్నార్‌లోని టీ తోటలు, కొండ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. హౌస్‌బోట్‌ ప్రయాణం, తోటల్లో నడక, ఆయుర్వేద చికిత్సలు, ప్రకృతి విహారం కోసం అక్టోబర్‌ మంచి సమయం.

గోవా బీచ్‌ల ప్రశాంతత

అక్టోబర్‌లో గోవా బీచ్‌లు వర్షాకాలం తర్వాత కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. శీతాకాలపు రద్దీ ఇంకా పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో ప్రశాంతమైన బీచ్‌లు, పచ్చని గ్రామీణ ప్రాంతాలు, రోడ్డు ప్రయాణాలను ఆస్వాదించవచ్చు.

వన్యప్రాణుల సందడి

వర్షాకాలం కారణంగా మూసివేసిన పలు జాతీయ పార్కులు అక్టోబర్‌లో తిరిగి తెరుచుకుంటాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్‌, కాన్హా, రాజస్థాన్‌లోని రణతంబోర్‌ వంటి ప్రాంతాల్లో సఫారీకి వెళ్లవచ్చు. పచ్చని అడవుల మధ్య పులులు, జింకలు, వివిధ పక్షులను చూసే అవకాశం ఉంటుంది.

తాజ్‌మహల్‌ అందాలు

అక్టోబర్‌లో ఆగ్రా వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్పష్టమైన ఆకాశం మధ్య తాజ్‌మహల్‌ తెల్లని పాలరాతి నిర్మాణం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా ఫోర్ట్‌, ఫతేపూర్‌ సిక్రీని కూడా సందర్శించవచ్చు.

మొత్తంగా.. పండుగల సందడి నుంచి కొండల అందాల వరకు, బీచ్‌ల నుంచి వన్యప్రాణుల సఫారీ వరకు అక్టోబర్‌ దేశవ్యాప్తంగా విభిన్న ప్రయాణ అనుభూతులను అందించే నెల. పండుగలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే బుకింగ్‌ చేసుకోవడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us