Telugu News Lifestyle These tips are for you to grow thick eyebrows, Check Here is Details in Telugu
Eyebrows Remedies: కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్స్ మీ కోసమే..
ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్లు అయితే.. కళ్ల అందాన్ని పెంచేవి ఐబ్రోస్. ఐబ్రోస్ ఒత్తుగా కనిపిస్తే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. కానీ చాలా మందికి సన్నగా ఉంటాయి. వీటిని పెంచేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిట్కాలు ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది..
Eyebrows 1
Follow us on
ముఖం అందంగా కనిపించాలంటే అన్నీ చక్కగా కనిపించాలి. ముఖంలో ముందుగా హైలెట్ అయ్యేవి కళ్లు. కేవలం కళ్లతోనే మాట్లాడొచ్చు. మరి ఆ కళ్లకు అందాన్ని తెచ్చేవి ఐబ్రోస్. కనుబొమ్మలు ఒత్తుగా అందంగా కనిపిస్తే.. ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
కానీ కొంత మందికి కను బొమ్మలు అనేవి చాలా సన్నగా ఉంటాయి. వీటిని ఒత్తుగా కనిపించేలా చేయడానికి పెన్సిల్, ఇతర బ్యూటీ ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇవి తాత్కాలికమే. కనుబొమ్మలు ఒత్తుగా కనిపించాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి.
ప్రతి రోజూ కొబ్బరి నూనెను కనుబొమ్మలపై రాస్తూ ఉండాలి. కాసేపు మర్దనా చేస్తే.. అక్కడ రక్త ప్రసరణ బాగా జరిగి కను బొమ్ములు ఒత్తుగా అవుతాయి. కేవలం కొబ్బరి నూనే కాకుండా ఈ నూనెలు కూడా చక్కగానే పని చేస్తాయి.
ఆముదం పూర్వ కాలం నుంచి వాడుకలో ఉంది. ఇప్పుడు ఆముదాన్ని ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదు. కానీ ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఈ ఆముదాన్ని ప్రతిరోజూ కనుబొమ్మలపై రాస్తే ఒత్తుగా పెరుగుతాయి. ఐబ్రోస్ని తరచూ దువ్వినా కూడా పెరుగుతాయి.
ఆలివ్ ఆయిల్, బాదం నూనె కూడా మంచివే. వీటిల్లో కూడా అనేక పోషకాలు ఉంటాయి. వీటిని రాత్రి నిద్రించే ముందు కనుబొమ్మలపై రాసి.. ఓ రెండు నిమిషాలు మర్దనా చేయాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది.