మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల రక్తపోటు సంబంధిత సమస్యల బారినడపుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓవైపు అధికరక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు కొందరైతే లోబీపీతో బాధపడుతున్న వారు మరికొందరు. అయితే హైబీపీ ఎంత ప్రమాదమో, లో బీపీ కూడా అంతే ప్రమాదకరమని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారినపడుతుంటారు. అయితే లోబీపీ రావడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా తీసుకునే ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పుల కారణంగా లోబీపీ బారినపడే వారి సంఖ్య పెరుగుతుంది. సరిగ్గా తినకపోవడం, తీసుకునే ఆహారంలో తగినంత ఉప్ప లేకపోవడం వంటివి లోబీపీకి కారణమవుతుందని మనకు తెలిసిందే. అయితే మరికొన్ని ప్రధాన కారణాల వల్ల కూడా లోబీపీ సమస్య వేధిస్తుందని అంటున్నారు.
అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోతే రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అడ్రినల్ గ్రంథి కార్టికో, మినెరలో కార్టికో స్టిరాయిడ్లను ఉత్పత్తి చేస్తుంది. వీటి మోతాదులు తగ్గితే బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది. శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నపలంగా తగ్గినా లోబీపీ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ధమనుల్లో పూడికలు ఉంటే పరీక్షల్లో లోబీపీ చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇక గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారిలో కూడా బీపీ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమస్య చాలా అరుదుగా కనిపిస్తుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకోవడం, క్రమం తప్పకుండా నీరు తాగడంతో పాటు వాకింగ్.. వ్యాయామాలు చేయడం వల్ల లోబీపీ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..