Health: కడుపులో గ్యాస్, ఛాతిలో మంట.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు

|

Oct 07, 2024 | 7:07 PM

ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనినే పెద్దపేగు క్యాన్సర్‌కుగా కూడా చెబుతుంటారు. అయితే ఈ వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని అంటున్నారు. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించవచ్చని అంటున్నారు. ఇంతకీ పెద్ద పేగు క్యాన్సర్‌ను...

Health: కడుపులో గ్యాస్, ఛాతిలో మంట.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు
Colorectal Cancer
Follow us on

తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన విధానంలో మార్పులు కారణం ఏదైనా ఇటీవల కడపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గ్యాస్‌, అజీర్తి, గ్యాస్, ఛాతిలో మంట వంటి సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది చిన్న సమస్యే అయినా కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని లక్షణాలు క్యాన్సర్‌కు ముందస్తు లక్షణాలు చెప్పొచ్చని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనినే పెద్దపేగు క్యాన్సర్‌కుగా కూడా చెబుతుంటారు. అయితే ఈ వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని అంటున్నారు. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించవచ్చని అంటున్నారు. ఇంతకీ పెద్ద పేగు క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే ఎలా గుర్తించాలి.? దాని లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పేగు కదలికల్లో తీవ్రమైన మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం లేదా కడుపు పూర్తిగా శుభ్రం కాలేదన్న భావన పదేపదే కలగడం వంటివి పెద్ద పేగు క్యాన్సర్‌కు ముందస్తు లక్షణంగా భావించాలని అంంటున్నారు. అదే విధంగా మలంలో రక్తం కనిపించడం కూడా కొలొరెక్టల్ క్యాన్సర్ ముందస్తు లక్షణంగా బావించాలని అంటున్నారు. ఇక ఎలాంటి డైటింగ్ పాటించకపోయినా బరువు తగ్గితే అది కొలెరెక్టల్ క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలి. ఉన్నపలంగా ఎక్కువ మొతంతో బరువు తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇక నిరంతరం కడుపు నొప్పి, తిమ్మిరం వంటి లక్షణాలు కనిపించినా.. ముఖ్యంగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వేధిస్తుంటే, కడుపు దీర్ఘకాలంగా ఉబ్బరంగా ఉంటున్నా, కడుపులో నిరంతరం అసౌకర్యంగా ఉంటున్నా జాగ్రత్తపడాలని అంటున్నారు. ఇక దీర్ఘకాలికంగా అలసటతో ఇబ్బంది పడుతున్నా అలర్ట్‌ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక పెద్దపేగు క్యాన్సర్‌కు నోటిలోని ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటమ్ అనే బ్యాక్టీరియా కారణమని పరిశోధనల్లో వెల్లడైంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..