Women Cancer: మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..

|

Sep 28, 2024 | 7:28 AM

శరీరంలో క్యాన్సర్‌ మొదలైన కొన్ని రోజుల్లోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరం మనల్ని ముందుగానే అలర్ట్ చేస్తుంది. అయితే ఈ లక్షణాలు మహిళల్లో, పురుషుల్లో వేరువేరుగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్‌ లక్షణాలు ఏవరుగా ఉంటాయి. మహిళల్లో కనిపించే కొన్ని ముందస్తు లక్షణాల గురించి ఇప్పుడుత తెలుసుకుందాం..

Women Cancer: మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
Cancer
Follow us on

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోన్న వ్యాధుల్లో క్యాన్సర్‌ మహమ్మారి ఒకటి. రోజురోజుకీ క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా క్యాన్సర్‌ బాధితుల సంఖ్య ఎక్కువుతోంది. అయితే క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.

శరీరంలో క్యాన్సర్‌ మొదలైన కొన్ని రోజుల్లోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరం మనల్ని ముందుగానే అలర్ట్ చేస్తుంది. అయితే ఈ లక్షణాలు మహిళల్లో, పురుషుల్లో వేరువేరుగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్‌ లక్షణాలు ఏవరుగా ఉంటాయి. మహిళల్లో కనిపించే కొన్ని ముందస్తు లక్షణాల గురించి ఇప్పుడుత తెలుసుకుందాం..

* మహిళల్లో క్యాన్సర్‌ ముందస్తు లక్షణాల్లో రక్తస్రావం ప్రధానమైంది. ముఖ్యంగా నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం వంటి లక్షణాలు గర్భాశయ క్యాన్సర్‌కు ముందస్తు లక్షణం కావొచ్చని చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

* శరీరంలో జరిగే కొన్ని మార్పులు కూడా క్యాన్సర్‌కు ముందస్తు లక్షణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మొహంలో కొన్ని ప్రాంతాల్లో ఉబ్బినట్లు కనిపించినా. రొమ్ము ప్రాంతంలో ఉబ్బు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా క్యాన్సర్‌కు ముందస్తు లక్షణంగా చెప్పొచ్చు.

* ఉన్నపలంగా బరువు తగ్గుతున్నా.? లేదా ఉన్నపలంగా బరువు పెరుగుతోన్నా క్యాన్సర్‌కు ముందస్తు లక్షణంగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. మహిళలల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణు అంటున్నారు.

* దీర్ఘకాలంగా శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో నొప్పి ఉంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా రొమ్ము, కడుపు, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించి.. పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు.

* చర్మ రంగులో మార్పు కనిపించినా, ముడతలు వచ్చినా వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి కారణం లేకుండా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* జీర్ణ సంబంధిత సమస్యలను కూడా లైట్ తీసుకోకూడదు. దీర్ఘకాలంగా అజీర్తి లేదా ఇతర జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలన నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..