ఎండ వల్ల మీ ముఖం, చేతులు, పాదాలు రంగు మారాయా? ఈ సింపుల్‌ చిట్కాలలో ఏదైనా ట్రై చేయండి.. మెరుపు ఖాయం!

ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం నల్లగా మారడాన్ని సన్ ట్యాన్ అంటారు. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి శరీరం మెలానిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల చర్మం తన సహజ రంగును కోల్పోయి నల్లగా మారుతుంది. ఈ ట్యాన్‌ను తగ్గించి, చర్మానికి తిరిగి ప్రకాశాన్ని తేవడానికి సహాయపడే అద్భుతమైన ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:సూర్యకాంతిలోని UV కిరణాల వల్ల ముఖం, చేతులు, మెడ, కాళ్లపై నల్లటి చారలు లేదా ట్యాన్ ఏర్పడటం సర్వసాధారణం. రసాయనిక ఉత్పత్తుల కంటే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో ట్యాన్‌ను సులభంగా తొలగించవచ్చు. బంగాళాదుంప, టమాటా, కలబంద, దోసకాయ, పెరుగు-పసుపు, చందనం, శనగపిండి, బొప్పాయి వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగించి, తేమను అందించి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ట్యాన్ పోగొట్టుకోవడానికి ఇవి సరళమైన, ప్రభావవంతమైన పరిష్కారాలు.

ఎండ వల్ల మీ ముఖం, చేతులు, పాదాలు రంగు మారాయా? ఈ సింపుల్‌ చిట్కాలలో ఏదైనా ట్రై చేయండి.. మెరుపు ఖాయం!
How To Remove Sun Tan

Updated on: Oct 01, 2026 | 7:22 AM

సూర్యకాంతిలోని UV కిరణాల వల్ల ముఖం, చేతులు, మెడ, కాళ్లపై నల్లటి చారలు లేదా ట్యాన్ ఏర్పడటం సర్వసాధారణం. రసాయనిక ఉత్పత్తుల కంటే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో ట్యాన్‌ను సులభంగా తొలగించవచ్చు. బంగాళాదుంప, టమాటా, కలబంద, దోసకాయ, పెరుగు-పసుపు, చందనం, శనగపిండి, బొప్పాయి వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగించి, తేమను అందించి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ట్యాన్ పోగొట్టుకోవడానికి ఇవి సరళమైన, ప్రభావవంతమైన పరిష్కారాలు.

బంగాళాదుంప రసం:

బంగాళాదుంపలో ఉండే కాటకోలేస్ అనే ఎంజైమ్ చర్మంపై ఉన్న నలుపును తగ్గించడంలో సహాయపడుతుంది. బంగాళాదుంప రసాన్ని ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టమాటా గుజ్జు:

టమాటాలోని లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మానికి రక్షణనిచ్చి, నలుపును తొలగిస్తుంది. టమాటా గుజ్జును ముఖం, చేతులకు రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

దోసకాయ రసం:

దోసకాయ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఎండ వల్ల కలిగే మంటను తగ్గించి చర్మాన్ని ఉత్తేజపరుస్తుంది. దోసకాయ రసాన్ని దూదితో ట్యాన్ ఉన్న చోట అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి.

పెరుగు, పసుపు:

పెరుగులోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగిస్తుంది. పసుపులో ఉన్న యాంటీబాక్టీరియల్ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. పెరుగులో కాస్త పసుపు కలిపి రాసి 20 నిమిషాల తర్వాత కడిగాలి.

కలబంద (అలోవెరా):

అలోవెరా చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది. కలబంద జెల్‌ను రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే కడగవచ్చు లేదా పసుపు, తేనెతో కలిపి 15 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకోవచ్చు.

మంచి గంధం (చందనం):

గంధానికి చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంది. గంధం పొడిని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేసి ట్యాన్ ఉన్న భాగాల్లో రాసి ఆరిన తర్వాత కడిగేయాలి.

శనగపిండి, పసుపు:

ఆయుర్వేదంలో శనగపిండిని చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగిస్తారు. శనగపిండి, పసుపు, పాలు కలిపి పేస్ట్‌లా చేసి రాసుకుని, ఆరిన తర్వాత మెల్లగా రుద్ది కడిగితే ట్యాన్ త్వరగా పోతుంది.

బొప్పాయి, తేనె:

బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ చర్మాన్ని ఉజ్వలంగా మారుస్తుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగితే చర్మం మెరుస్తుంది.

సన్ ట్యాన్ తగ్గడానికి మార్కెట్లో లభించే కెమికల్ క్రీములు వాడేకంటే, ఈ సహజసిద్ధమైన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే చర్మానికి ఎలాంటి హాని కలగకుండా సహజమైన కాంతి సొంతమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us