Headache relief tricks: తలనొప్పితో బాధపడుతున్నారా ? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఉపశమనం పొందవచ్చు..

|

Feb 22, 2021 | 1:22 PM

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య తలనొప్పి. ఎప్పుడు ఏ క్షణానా ఈ సమస్య వేధిస్తోందో చెప్పడం కష్టం. అయితే ఈ సమస్య ఒకేసారి వచ్చి వెళ్ళదు. దాదాపు

Headache relief tricks: తలనొప్పితో బాధపడుతున్నారా ? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఉపశమనం పొందవచ్చు..
Follow us on

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య తలనొప్పి. ఎప్పుడు ఏ క్షణానా ఈ సమస్య వేధిస్తోందో చెప్పడం కష్టం. అయితే ఈ సమస్య ఒకేసారి వచ్చి వెళ్ళదు. దాదాపు కొన్ని నెలల పాటు ఈ సమస్య వేధిస్తుంటుంది. అలాగే.. కొందరిలో ట్యాబ్లెట్స్ వాడితే ఫలితం కనిపించినా..మరికొందరికి తగ్గదు. అసలు ఈ తలనొప్పికి కారణాలేమిటో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభం అవుతుంది. కంటిచూపు సమస్యలు, చెవి, దంతాల సమస్యలు లేనప్పుడు మెదడులో కంతులు, ఇతర వికారాల వంటి జబ్బుల గురించి ఆయా పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటివి లేకపోతే కేవలం క్రియాపరమైన మార్పులే తలనొప్పికి కారణాలవుతాయి. ఇక మైగ్రేన్, మానసిక ఒత్తిడి, హైబీపీ వంటి సమస్యలు. నిద్రమాములుగా పట్టి, మళ్లీ నిద్రలేవగానే వస్తుంటే అది మానసిక ఉద్వేగం… ఆందోళనవంటి ఒత్తిడులుగా భావించవచ్చు. ఇక బీపీ, షుగర్ వంటి వ్యాధులున్న వారు అధికంగా మందులు వాడడం వలన ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి ఈ సమస్య బాధించవచ్చు.

మానసిక ఒత్తిడి కలిగించే అంశాలు..

ఆర్థిక సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, కుటుంబసమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం వంటి అంశాలతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అలాగే ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడే వారిలో కూడా ఈ సమస్య అధికం. అయితే ఇందుకు కారణాలను అన్వేషించి.. క్రమంగా దూరం చేసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా కొన్ని అలవాట్లను చేసుకోవడం వలన తలనొప్పి సమస్యను నివారించవచ్చు. రోజూ కాలకృత్యాలు సాఫీగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పులుపు, ఉప్పు, కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రేష్ ఫుడ్స్, సలాడ్స్, మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకోవాలి. అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనేతో తలకు మర్దనా చేయాలి. అలాగే శరీరానికి మసాజ్, ధారా చికిత్స తీసుకోవాలి. కానీ ఇవి నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఇవేకాకుండా శరీరానికి కాస్తా శ్రమ కల్పించడం, ధ్యానం చేయడం, సంగీతం వినడం చేయాలి. అతిగా ఆలోచించకూడదు. వీటి ద్వారా క్రమంగా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.

Also Read:

మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా ? దాని లక్షణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం..