మహిళలు రోజూ రాత్రి 2 ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా?

నేటి బిజీ జీవనశైలి, ఒత్తిడి కారణంగా చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నివారణకు ఆహారంలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలను నేతిలో లేదా డ్రై రోస్ట్ చేసి తినడం మహిళల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా గర్భాశయం బలపడటంతో పాటు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. అలాగే మహిళల్లో రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఎముకలు ధృడంగా మారుతాయి.

మహిళలు రోజూ రాత్రి 2 ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా?
Roasted Dates Benefits

Updated on: Nov 17, 2026 | 1:25 PM

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతమైన మానసిక ఒత్తిడి నేడు అనేక మంది మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత, సంతానొత్పత్తికి సంబంధించిన సమస్యలు సర్వసాధారణమైపోయాయి. గర్భధారణకు ప్రయత్నించే సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలు ఖచ్చితంగా తమ రోజువారీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహిళల సంతానొత్పత్తి శక్తిని సహజంగా పెంచడంలో ఖర్జూరం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. అందులోనూ ఖర్జూరాన్ని వేయించి తినడం ద్వారా మరింత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

ఆయుర్వేదంలో వేయించిన ఖర్జూరానికి ఉన్న ప్రాధాన్యత:

ఆయుర్వేద వైద్య నిపుణుల ప్రకారం, స్త్రీ, పురుషులలో సంతానొత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో వేయించిన ఖర్జూరం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో పడుకునే ముందు కేవలం రెండు వేయించిన ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, ప్రత్యుత్పత్తి అవయవాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే శరీరంలో వాత దోషాన్ని శాంతపరచడంలో సహాయపడి, హార్మోన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మహిళలకు వేయించిన ఖర్జూరం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు:

హార్మోన్ల సమతుల్యత, అండాల నాణ్యత: వేయించిన ఖర్జూరంలో ఇనుము, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎండోక్రైన్ గ్రంథుల పనితీరును మెరుగుపరిచి, హార్మోన్లు సరిగ్గా విడుదల అయ్యేలా సహాయపడతాయి. దీనివల్ల నెలసరి క్రమబద్ధమవుతుంది. అండం విడుదలయ్యే ప్రక్రియ మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

గర్భాశయం బలపడటం: చాలా మంది మహిళల్లో గర్భాశయం బలహీనంగా ఉండటం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. వేయించిన ఖర్జూరం తినడం వల్ల గర్భాశయ కండరాలు బలంగా మారుతాయి, దీనివల్ల గర్భధారణ సురక్షితంగా నిలబడే అవకాశం పెరుగుతుంది.

రక్తహీనత నివారణ: ఖర్జూరంలో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గి, హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి.

ఎముకల బలం: ఇందులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్ కె వంటి పోషకాలు ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సంతానొత్పత్తి సమస్యలను అధిగమించడానికి నిపుణుల సలహాతో రోజూ వేయించిన ఖర్జూరాన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us