Reverse Walk: వెనక్కు నడిస్తే ఇన్ని లాభాలా..? రివర్స్ వాక్ ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..

|

Aug 29, 2024 | 8:39 AM

మనం వెనక్కు వెళితే ఏమి జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? సాధారణంగా మనమందరం ముందుకు నడుస్తాము.. కానీ వెనుకకు నడవడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు..

Reverse Walk: వెనక్కు నడిస్తే ఇన్ని లాభాలా..? రివర్స్ వాక్ ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..
Benefits of Walking Backwards
Follow us on

రివర్స్ వాక్.. (వెనుకకు నడవడం).. ఈ పదం కాస్త వింతగా అనిపించినా దాని ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. సాధారణంగా నడవడం వల్ల కాళ్లపై ఒత్తిడి పడదు.. కానీ, రివర్స్ వాకింగ్ చేస్తే కాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.. ఇది సమతుల్యతను కాపాడుకోవడంలో, శరీర బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మెదడు ఏకాగ్రతను పెంచడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అవును.. ఇలా రివర్స్ వాకింగ్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే ఇది సాధారణ నడక కంటే చాలా కష్టంగా ఉంటుంది.

వాస్తవానికి, రివర్స్ వాకింగ్ మీ శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను మెరుగుపరుస్తుంది. మీరు సాధారణ నడకకు బదులుగా వెనుకకు నడిచినప్పుడు, మీ మనస్సు పూర్తిగా మీ శరీరం కదలికపై దృష్టి పెడుతుంది. దీనివల్ల శరీర సమతుల్యతతోపాటు మనసు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీంతోపాటు ఇది బరువు తగ్గించడంలో ప్రయోజనకరమైనది, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం. వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మోకాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక ఇతర సమస్యలను దూరం చేస్తుంది.

అధ్యయనంలో ఏం గుర్తించారు..

రివర్స్ వాకింగ్ పై నిర్వహించిన ఒక అధ్యయనంలో.. ఈస్ట్ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజిస్ట్ నిపుణుడు జాక్ మెక్‌నమరా కూడా రివర్స్ వాకింగ్ ప్రయోజనకరమని వివరించారు. అదే సమయంలో, మెల్‌బోర్న్‌లోని లా ట్రోబ్ యూనివర్శిటీలో ఫిజియోథెరపీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బార్టన్ కూడా వెనుకకు నడవడం మనం సాధారణంగా అనుభవించని మార్గాల్లో కండరాలు, శరీరాన్ని దృఢంగా చేస్తుందని చెప్పారు. మీరు సాధారణంగా అర్థం చేసుకుంటే, ఇది శరీరం, మనస్సు మధ్య బలమైన సమన్వయాన్ని సృష్టించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

అద్భుతమైన కార్డియో వ్యాయామం:

జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇంటర్నేషనల్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. రివర్స్ వాక్ ఒక అద్భుతమైన, సమర్థవంతమైన కార్డియో వ్యాయామం.. సాధారణ నడక కంటే ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, రివర్స్ నడక కూడా కాస్త రిస్క్‌గా పరిగణిస్తారు.. వెనుకకు నడుస్తుంటే.. వెనుకకు చూడలేరు. అటువంటి పరిస్థితులలో, పడిపోయే ప్రమాదం చాలా సార్లు పెరుగుతుంది. కానీ మీరు దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత, అది మీకు సులభం అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..