Viral news: మిస్‌ థాయ్‌లాండ్‌ ధరించిన ఈ డ్రస్‌ వేటితో తయారు చేశారో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే.

|

Jan 13, 2023 | 12:04 PM

కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అన్నట్లు ఉంటుంది. ఒకప్పుడు ఓల్డ్ మోడల్‌ అనుకున్న ఫ్యాషన్‌ మళ్లీ తిరిగి ట్రెండ్‌గా మారుతుంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ల ఆలోచనలకు అనుగుణంగా డ్రసింగ్ స్టైల్స్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వెరైటీ డ్రస్‌ నెట్టింట తెగ వైరల్‌...

Viral news: మిస్‌ థాయ్‌లాండ్‌ ధరించిన ఈ డ్రస్‌ వేటితో తయారు చేశారో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే.
Miss Universe Thailand
Follow us on

కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అన్నట్లు ఉంటుంది. ఒకప్పుడు ఓల్డ్ మోడల్‌ అనుకున్న ఫ్యాషన్‌ మళ్లీ తిరిగి ట్రెండ్‌గా మారుతుంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ల ఆలోచనలకు అనుగుణంగా డ్రసింగ్ స్టైల్స్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వెరైటీ డ్రస్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మిస్‌ యూనివర్స్‌ థాయ్‌లాండ్‌ ధరించిన డ్రస్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆమె ధరించిన డ్రస్ తయారీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

2022లో నిర్వహించిన మిస్‌ యునివర్స్‌ థాయ్‌లాండ్‌ పోటీల్లో భాగంగా అన్నా సూయంగం ఐయామ్‌ అనే యువతి విజయాన్ని సాధించింది. 1998లో బ్యాంకాంగ్‌లో జన్మించిన సూయంగం డంపింగ్ ఏరియాలో పెరిగింది. అన్నా తల్లి దండ్రులు ఇద్దరు చెత్త ఏరుకుని జీవనం సాగించేవారు. ఇలాంటి కుటుంబంలో జన్మించి మిస్‌ యూనివర్స్‌ థాయ్‌లాండ్‌ రేంజ్‌కి ఎదిగింది అన్నా. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అన్నా సూయంగం ఓ వెరైటీ డ్రస్‌లో కనిపించింది అందరినీ మెప్పించింది. పైన ఫొటోలో కనిపిస్తున్న దగ దగ దగ మెరిసిపోతోంది కదూ.? ఈ డ్రస్‌ను డైమండ్స్‌తో రూపొందించారి అనుకుంటున్నారా.?

అయితే ఈ డ్రస్‌ని చెత్తలో పడేసే డ్రింక్‌ క్యాన్స్‌ పుల్‌ ట్యాబ్స్‌తో తయారు చేశారు. కోక్‌ టిన్స్‌ ఓపెన్‌ చేయడానికి ఉపయోగపడే ట్యాబ్స్‌ ఉంటాయి చూడండి వాటి సహాయంతో ఈ డ్రస్‌ను రూపొందించారు. చెప్పేంత వరకు అసలు వాటితో తయారు చేశారన్న విషయం తెలియకపోవడం విశేషం. తాజాగా ఈ డ్రస్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మిస్‌ యూనివర్స్‌ థాయిలాండ్‌ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఆమెలోని పట్టుదల, ఆశావాదమే ఆమెను జీవితంలో గొప్ప విజయానికి దారి తీశాయి. చెత్త ఏరుకుంటూ జీవితం సాగించిన తల్లిదండ్రుల పెంపకం ఫలితం ఇది’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..