Motivational: రతన్ టాటా చెప్పిన ECG ఫార్ములా..ఇది తెలిస్తే మీరు ఓటమికి భయపడరు..!

Ratan Tata Inspirational Quotes: రతన్ టాటా పేరు భారతీయ వ్యాపార రంగంలో విజయానికి, విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. వ్యాపారవేత్తగా అపార విజయాలు సాధించిన ఆయన, తన మానవతా దృక్పథంతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించారు. "జీవితం ECGలా ఎగుడుదిగుడుగానే ఉండాలి" అనే ఆయన సందేశం జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలన్న గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నేటికీ ఆయన ఆలోచనలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Motivational: రతన్ టాటా చెప్పిన ECG ఫార్ములా..ఇది తెలిస్తే మీరు ఓటమికి భయపడరు..!
Ratan Tata Inspirational Quote

Updated on: Jun 12, 2026 | 8:02 PM

రతన్ టాటా.. ఆయన దేశం మెచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త మాత్రమే కాదు.. విలువలకు మారుపేరు. భారతీయ పారిశ్రామిక రంగంలో విశిష్ట స్థానం సంపాదించిన దిగ్గజాల్లో రతన్ టాటా పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. వ్యాపార రంగంలో విజయాలతో పాటు తన మానవతా దృక్పథంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు ఆయన. ఆయన చెప్పిన మాటలు, జీవిత పాఠాలు నేటికీ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. జీవితం ECGలా ఎగుడుదిగుడుగానే ఉండాలి అనే ఆయన సందేశం కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలన్న గొప్ప సందేశాన్ని ఇస్తుంది.

జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, అవే మన ఎదుగుదలకు సూచికలని అంటారు రతన్ టాటా. ‘ECGలో గీతలు ఎగుడుదిగుడుగా ఉన్నంత వరకు జీవితం కొనసాగుతున్నట్టే.. అవి సరళ రేఖగా మారితే జీవితం ముగిసినట్టే’ అనే ఆయన సందేశం కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలనే జీవిత సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఓటమిని ఎదుర్కొని నిలబడాలని ఎందరికో ఆయన సందేశం స్ఫూర్తిని ఇస్తుంది. జీవితంలో కష్టాలు, సుఖాలు, విజయాలు, అపజయాలు సహజం. అయితే చాలామంది తమ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు నిరాశకు గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో రతన్ టాటా చెప్పిన ఈ గొప్ప సందేశం మనకు ధైర్యాన్ని ఇస్తుంది.

Ups and downs in life are very important to keep us going, because a straight line even in an ECG means we are not alive. – Ratan Tata

ఇవి కూడా చదవండి

ఆసుపత్రిలో ECG యంత్రాన్ని పరిశీలిస్తే గుండె స్పందనను సూచించే గీతలు ఎగువకు, దిగువకు కదులుతూ కనిపిస్తాయి. ఆ గీతలు పైకి కిందకు ఉండటమే ఆ మనిషి ప్రాణాలతో ఉన్నాడనడానికి సంకేతం. అదే గీతలు నిటారుగా మారితే గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టే..అంటే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లే. మన జీవితమూ అంతే.. ఎత్తుపల్లాలు లేకుండా, సవాళ్లు లేకుండా జీవితం ముందుకు సాగదన్న సందేశం రతన్ టాటా వ్యాఖ్యల్లో ఉంది.

ఆటుపోట్లతో జీవితంలో ఎదిగిన రతన్ టాటా

రతన్ టాటా జీవితం కూడా వడ్డించిన విస్తరికాదు. తొలినాళ్లలో జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, సవాళ్లు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రతి అపజయాన్ని ఒక పాఠంగా తీసుకుని మరింత బలంగా ముందుకు సాగారు. అందుకే ఆయన భారతదేశం మెచ్చిన వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారు.

జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని శాపంగా కాకుండా అవకాశంగా చూడాలి. కష్టకాలం శాశ్వతం కాదు.. ఓర్పు, పట్టుదల, సానుకూల దృక్పథం ఉంటే ఏ సవాలునైనా అధిగమించవచ్చు. రతన్ టాటా చెప్పిన ECG సూత్రం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఎగుడుదిగుడులు ఉన్నంత వరకు జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది.

Also Read: ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ

Follow Us