
ఉదయం ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ఎంతో ఫ్రెష్‌గా, అందంగా ఉండే ముఖం.. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి పూర్తిగా అలసిపోయి, కాంతివిహీనంగా మారిపోవడాన్ని చాలా మంది గమనించే ఉంటారు. దీనిని నిపుణులు టెక్ ఫేస్ (Tech Face) లేదా ఆఫీస్ ఎయిర్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. దీనికి గల ముఖ్యమైన కారణాలు, ఎలా నివారించాలో తప్పక తెలుసుకోవాలి.
లాప్‌టాప్‌లు, మొబైల్స్, ఆఫీస్ లోని కృత్రిమ ఎల్‌ఈడీ లైట్ల నుండి వెలువడే బ్లూ లైట్ (High Energy Visible – HEV Light) సూర్యరశ్మి కంటే లోతుగా చర్మంలోకి చొచ్చుకుపోతుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్ (Collagen) ను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మంపై ముడతలు రావడం, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు (Dark Circles) ఏర్పడటం, ముఖం నిస్తేజంగా మారడం జరుగుతుంది.
ఆఫీసుల్లో 8 నుండి 9 గంటల పాటు నిరంతరం నడిచే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ (AC) గాలిలోని తేమను పూర్తిగా పిండేస్తుంది. దీనివల్ల చర్మం లోపలి పొరల్లోని తేమను కోల్పోయి (Transepidermal Water Loss), పొడిబారిపోయి, పొట్టులా రాలడం లేదా జిడ్డుగా మారడం జరుగుతుంది.
ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌ల వల్ల పెరిగే ఒత్తిడి శరీరంలో కార్టిసోల్ (Cortisol) అనే స్ట్రెస్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ చర్మానికి జరిగే రక్తప్రసరణను తగ్గించి, ముఖాన్ని అలసిపోయినట్లుగా, పాలిపోయినట్లుగా చూపిస్తుంది.
పనిలో పడి చాలా మంది గంటల తరబడి నీళ్లు తాగడం మర్చిపో తుంటారు. శరీరానికి తగినంత నీరు అందకపోవడం నేరుగా ముఖంపై కనిపిస్తుంది.
ఇండోర్ సన్‌స్క్రీన్ (Indoor Sunscreen): మీరు ఆఫీస్ లోపల, స్క్రీన్ల ముందే కూర్చున్నప్పటికీ.. బ్లూ లైట్ నుండి రక్షణ పొందడానికి ఉదయాన్నే లాప్‌టాప్ ఆన్ చేయడానికి ముందే ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ (Zinc Oxide లేదా Titanium Dioxide ఉన్నవి) రాసుకోవడం తప్పనిసరి.
కళ్లు, కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మాన్ని కాపాడుకోవడానికి యాంటీ-బ్లూ లైట్ చైనీస్ లేదా గ్లాసెస్ ధరించడం మంచిది.
ప్రతి గంటకు ఒకసారి సీటు నుండి లేచి కాసేపు కళ్లకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. ముఖంపై చల్లటి నీటిని చల్లుకోవడం వల్ల చర్మం రీఫ్రెష్ అవుతుంది.
మీ డెస్క్ పై ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. పని మధ్యలో నీళ్లు తాగుతూ ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..