Indigestion: అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ..

వేగవంతమైన జీవనశైలి, సమయానికి తినకపోవడం, వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం వస్తుంది. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోతే ఈ సమస్య తలెత్తుతుంది. దీని వలన కడుపులో భారంగా అనిపించడం, గ్యాస్, మంట, ఉబ్బరం, అసౌకర్యం కలుగుతాయి. కొన్నిసార్లు..

Indigestion: అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ..
Indigestion

Updated on: Mar 03, 2026 | 8:17 PM

అజీర్ణం అనేది సర్వసాధారణమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి. వేగవంతమైన జీవనశైలి, సమయానికి తినకపోవడం, వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం వస్తుంది. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోతే ఈ సమస్య తలెత్తుతుంది. దీని వలన కడుపులో భారంగా అనిపించడం, గ్యాస్, మంట, ఉబ్బరం, అసౌకర్యం కలుగుతాయి. కొన్నిసార్లు తిన్న తర్వాత కడుపు నొప్పి, వికారం, ఛాతీలో మంట కూడా సంభవిస్తంఉది. అయితే ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే ఆకలి లేకపోవడం, శరీరంలో బలహీనతకు దారితీస్తుంది. కాబట్టి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తేలికగా తీసుకోకూడదు. కాబట్టి ఏ రకమైన ఆహారాలు అజీర్ణానికి కారణమవుతాయో, ఈ సమస్యను నివారించడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఏ రకమైన ఆహారాలు అజీర్ణానికి కారణమవుతాయి?

ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ వైద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం.. వేయించిన, అధిక కారంగా ఉండే ఆహారాలు అజీర్ణానికి ప్రధాన కారణాలు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, అధిక నూనెలో వండిన ఆహారాలు కూడా జీర్ణం కావడం కష్టం. అధిక స్వీట్లు, శీతల పానీయాలు, కెఫిన్ కలిగిన పానీయాలు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అంతే కాదు రాత్రిపూట భారీ భోజనం తినడం వల్ల కడుపుకు విశ్రాంతి లభించకపోవచ్చు. ఇది అజీర్ణ సమస్యలను కూడా పెంచుతుంది. అధిక మసాలాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్ కూడా గ్యాస్, ఆమ్లతకు కారణమవుతాయి. కొంతమందికి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల అజీర్ణానికి కారణమవుతుంది.

అజీర్ణం సమస్యను ఎలా నివారించాలి?

సాధారణంగా అజీర్ణాన్ని నివారించడానికి, తేలికైన, సమతుల్య ఆహారం తీసుకోవాలి. సరైన సమయంలో తినడం ద్వారా ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. వేయించిన జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. ఆహారాన్ని బాగా నమిలి, పుష్కలంగా నీళ్లు తాగాలి. ప్రతిరోజూ ఖాళీ సమయంలో కొద్దిసేపు నడవడం, తేలికపాటి వ్యాయామం చేయడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే వీలైనంత వరకు రాత్రి పూట ఆలస్యంగా తినడం మానుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us