
Lemon: నిమ్మకాయలు.. ఇవి దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటాయి. నిమ్మకాయ చడ్నీనిని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. నిమ్మ రసం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో ఉండే సి-విటమిన్ వల్ల ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మకాయలకు ఎప్పుడు చూసినా భారీగానే గిరాకీ ఉంటుంది. వేసవి కాలంలో నిమ్మకాయకు డిమాండ్ విపరీతంగా పెరిగి దాని ధర మరింతగా పెరుగుతుంది. అయితే చాలా మంది గృహిణులు నిమ్మకాయలు త్వరగా పాడైపోతాయని బాధపడుతుంటారు. ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంచుకునేందుకు ప్రయత్నించినా అవి మూడు, నాలుగు రోజుల్లోని ఎండిపోతుంటాయి. అయితే నిమ్మకాయలు కనీసం ఒక నెలపాటు పాడవకుండా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం ..
చాలా మంది గృహిణులు నిమ్మకాయలు వేగంగా పాడైపోతాయని చెబుతుంటారు. నిమ్మకాయలను కనీసం ఒక నెల పాటు ఎలా నిల్వ చేసుకునేలా చేయవచ్చు. నిమ్మకాయను ప్రతి ఇంట్లో వాడతారు. నిమ్మరసంలో చాలా గుణాలున్నాయి. నిమ్మకాయను వంటలో చాలా రకాలుగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు నిమ్మకాయల ధర ఒక్కసారిగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. కొన్నిసార్లు మీరు తక్కువ ధరకు కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయల సేకరణకు పెద్దగా ఖర్చు ఉండదు.
నిమ్మకాయలను ఒక బౌల్‌లో నీటిని వేసి ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల త్వరగా పాడైపోకుండా ఉంటాయంటున్నారు కొందరు. నీటిలో ఉంచితే ఒక నెల వరకు తాజాగా ఉంటాయి. నిమ్మకాయను నీళ్లలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఒక గాజు పాత్రను తీసుకొని నీటితో నింపండి. తర్వాత ఈ నీళ్లలో నిమ్మకాయ వేయాలి. ఫ్రిజ్‌లో ఉంచితే నెలల తరబడి తాజాగా ఉంటుంది.
నిమ్మకాయలను ఇంటికి తెచ్చిన తర్వాత ముందుగా కడగాలి. తర్వాత ఈ నిమ్మకాయ నుండి రసాన్ని పిండుకుని ఉంచుకోవాలి. ఆ రసాన్ని ఐస్ ట్రేలో వేయండి. అప్పుడు ఈ ట్రేని ఫ్రిజ్‌లో ఉంచండి. అంతేకాదు చాలా కాలం పాటు ఈ నిమ్మరసాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
చాలా మంది నిమ్మకాయలను ఫ్రిజ్ లో కవర్ పెట్టి ఉంచుతారు. అయితే, అవి త్వరగా పాడైపోతాయి. అందుకే నిమ్మకాయలను ప్లాస్టిక్ బాక్స్ లో భద్రపరచడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు చెడిపోకుండా ఎక్కువ కాలం ఉంచుకోవచ్చు. అయితే నిమ్మకాయలను కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంచుకునే నిమ్మకాయలు గట్టి చర్మం ఉన్న వాటి కంటే జ్యుసిగా ఉన్నందున అవి సన్నగా ఉండేలా చూసుకోండి. మీరు తక్షణ ఉపయోగం కోసం నిమ్మకాయలను కొనుగోలు చేయకపోతే, పక్వానికి సమయం పట్టే ఆకుపచ్చని వాటిని కొనడానికి ఇష్టపడండి.
నిమ్మకాలయను ఒక గాలి చొరబడిని ప్లాస్టిక్ కవర్‌లో కూడా వేసి ఉంచితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ అంటే జిప్‌లాక్ కవర్ లాంటివి. ఇవి ఆన్‌లైన్‌లో కూడా లభిస్తాయి.
ఇవి కూడా చదవండి:
Gold Price: యుద్ధం ఎఫెక్ట్.. భారత్‌లో తులం బంగారం ధర రూ.2 లక్షలు దాటనుందా?
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి