
ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకునే వారికి వాటి వల్ల వచ్చే ఒక రకమైన వింత వాసన పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు లేదా అతిథులు వస్తున్నప్పుడు ఈ వాసన ఇబ్బందికరంగా అనిపిస్తుంది. దీనిని నివారించడానికి కెమికల్ రూమ్ స్ప్రేలు వాడకుండా, 8 సహజమైన, సులువైన పద్ధతులను పాటించవచ్చు. ఇంట్లో దొరికే బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం వంటి వస్తువుల సహాయంతో సోఫాలు, కార్పెట్లు, పెంపుడు జంతువుల పడకల నుండి వచ్చే వాసనలను పూర్తిగా తొలగించవచ్చు. అలాగే ఇల్లు నిరంతరం సువాసనభరితంగా ఉండటానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..
బేకింగ్ సోడా (వంటసోడా) వాసనలను పీల్చుకోవడంలో నంబర్ వన్. అతిథులు రావడానికి కొన్ని గంటల ముందు పెంపుడు జంతువులు కూర్చునే సోఫాలు, కార్పెట్లపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లాలి. ఒక గంట తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేస్తే వాసనలన్నీ మాయమవుతాయి.
పెంపుడు జంతువుల పడకలు, బ్లాంకెట్ల నుండే ఎక్కువ వాసన వస్తుంది. కాబట్టి, వాటిని వారానికి ఒకసారి వేడి నీళ్లలో డిటర్జెంట్, కొద్దిగా వెనిగర్ వేసి వాష్ చేయాలి.
ఒక స్ప్రే బాటిల్‌లో సమాన భాగాల్లో నీరు, వైట్ వెనిగర్ కలిపి ఇల్లు, గోడల మూలలు, కర్టెన్లపై లైట్‌గా స్ప్రే చేయాలి. వెనిగర్ ఆరిపోయాక దుర్వాసనలను పూర్తిగా తుడిచిపెడుతుంది.
ఇంట్లో HEPA ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ వాడటం వల్ల గాలిలో ఉండే పెంపుడు జంతువుల వెంట్రుకలు, చర్మపు పొట్టు, వాసనలు ఫిల్టర్ అవుతాయి.
కృత్రిమ రూమ్ స్ప్రేల కంటే సహజమైన గాలి ఎంతో మేలు. రోజుకు కనీసం రెండు సార్లు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోని చెడు గాలి బయటకు పోయి ఇల్లు ఫ్రెష్‌గా మారుతుంది.
ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో నిమ్మకాయ ముక్కలు, దాల్చినచెక్క, లేదా లవంగాలు వేసి కాసేపు మరిగిస్తే.. ఆ ఆవిరి ఇల్లంతా అద్భుతమైన సువాసనను నింపుతుంది.
కుక్కలు, పిల్లులను క్రమం తప్పకుండా స్నానం చేయించడం, వాటి వెంట్రుకలను బ్రష్ చేయడం వల్ల ఇల్లు త్వరగా మురికి అవ్వకుండా ఉంటుంది.
పిల్లుల లీటర్ బాక్స్‌ను రోజూ క్లీన్ చేయాలి. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మూత్రం పోస్తే, ఆ ప్రాంతాన్ని ఎంజైమాటిక్ క్లీనర్‌తో తుడవాలి, లేదంటే ఆ వాసన అలాగే ఉండిపోతుంది.
అతిథులు రాకముందే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే, మీ పెంపుడు జంతువులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ ఇంటికి వచ్చే వారికీ ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుంది!