Mental health: మానసిక ఆరోగ్యం సరిగ్గాలేకపోతే చిన్నవయసులోనే ఆ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ..

వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. మానసిక ఆరోగ్యం పదిలంగా లేకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులతో సహా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం..

Mental health: మానసిక ఆరోగ్యం సరిగ్గాలేకపోతే చిన్నవయసులోనే ఆ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ..
Mental Health

Updated on: Jul 24, 2022 | 1:49 PM

Heart disease and mental health: వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. మానసిక ఆరోగ్యం పదిలంగా లేకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులతో సహా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువని అంటున్నారు. సాదారణంగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే వారికి తెలియగానే క్రమంగా డిప్రెషన్‌కు లోనవడం సర్వసాధారణం. ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (IHD), కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD) కారణంగా దాదాపు 7.4 మిలియన్ మరణాలు సంభవించినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. IHD అనేది ధమనుల్లో ఫలకం అధికంగా పేరుకుపోయి, గుండెకు రక్త ప్రసరణ అవ్వకుండా అడ్డుకునే స్థితి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ కోపం, ఆందోళన, భ్రమలు, నిరాశ, కన్‌ఫ్యూజన్‌ వంటి లక్షణాల వల్ల కోరి కోరి హృదయ సంబంధిత జబ్బులను తెచ్చుకుంటున్నాట్లు అధ్యయనాలు వెల్లడించాయి. నిరుద్యోగం, నిద్ర లేకపోవడం, అత్యంత ఆప్తులను కోల్పోయినప్పుడు తీవ్రమరైన మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఎక్కువ. మానసిక అనారోగ్యానికి, IHD మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల్లో క్రమంగా IHD అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారి మానసిక ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవాలి.

ఎలా బయటపడాలి..
ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజుకు10 నిమిషాల నుంచి ప్రారంభించి క్రమంగా ఆ సమయాన్ని పెంచుకుంటూ ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానంతోపాటు చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. రోజూ 10-15 నిమిషాల పాటు సాధారణ శ్వాస వ్యాయామాలు ఎంతో సహాయపడతాయి. అలాగే ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జయిటీ ఉన్న రోగులకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) తీసుకోవడం మంచిది. భావోద్వేగ ప్రతిచర్యలను గుర్తించడంలో సీబీటీ సహాయపడుతుంది. ట్రెడ్‌మిల్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్, మెట్లు ఎక్కడం, చురుకైన నడక వంటి తేలికపాటి ఎక్సర్‌సైజులు రోజుకు కనీసం 30 నిమిషాలపాటు చేయడం అలవాటు చేసుకోవాలి.