Rice Water Benefits
Rice Water Health Benefits: వేసవి, వర్షాకాలంలో కలుషిత నీరు తాగడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల పలు రకాల అంటు వ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. అటువంటి వ్యాధుల్లో అతిసారం ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారికి లూజ్ మోషన్, వాంతులు కారణంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో నీరు వేగంగా కోల్పోవడమే కాకుండా లవణాలు, ఖనిజాల కొరత ఏర్పడుతుంది. దీని వల్ల బలహీనత బాగా పెరుగుతుంది. ఈ పోషకాహార లోపాలను చాలా త్వరగా తొలగించడంలో రైస్ వాటర్ చాలా సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ రైస్ వాటర్‌ను ఎలా తయారుచేయాలి.. ఎలా ఉపయోగించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..
ఆయుర్వేద పద్ధతులు
- ఆయుర్వేదంలో.. చాలా వ్యాధులలో ఆహారం ద్వారా శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేసే పద్ధతులను వివరించారు. విరేచనాలు అయినప్పుడు బియ్యం నీటి ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.
- ప్రెషర్ కుక్కర్లు లేనప్పుడు అప్పట్లో గుండల్లో లేదా.. గిన్నెలలో అన్నం వండుకుని తినేవారు. అన్నం ఉడికిన తర్వాత పాత్రలో మిగిలి ఉన్న నీటిని తీసివేసి గంజిని వేరు చేస్తారు.
- ఈ గంజిలో నల్ల ఉప్పు కలుపుకుని తాగితే శారీరక బలహీనత తొలగిపోతుంది. ఎందుకంటే ఈ గంజి నీరులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
- ఈ నీరు విరేచనాలను కూడా నయం చేస్తుంది. దీంతో పాటు అతిసారాన్ని నయం చేయడానికి ఏ ఔషధం కూడా ఇంతకంటే మంచిగా ప్రభావితం చేయదు.
గంజిని ఇలా తయారు చేసుకోండి..
- గంజి (బియ్యం నీటిని) తయారు చేయడానికి.. కుక్కర్లో కాకుండా మరేదైనా పాత్రలో బియ్యం కడిగి పోయ్యి మీద పెట్టండి. తక్కువ మంట మీద అన్నం అయ్యేలా ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని వంపేయాలి. ఈ నీరు జిగటగా.. తెల్లగా ఉంటుంది.
- మీరు ఈ పద్ధతిలో అన్నం వద్దనుకంటే.. ఒక కప్పు బియ్యంలో 6 కప్పుల నీటిలో వేసి తక్కువ మంటపై ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత అది మొత్తం కరిగేలా (పాయసంలా) అలానే ఉంచాలి. బాగా జావలా అయిన తర్వాత బ్లాక్ సాల్ట్ (రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్) కలిపి సూప్ లాగా తాగాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..